టీడీఎల్పీ భేటీలో జగన్ గురించి రెండు సినిమా క్లిప్పింగ్స్... ఆ కమెడియన్‌తో పోలుస్తూ...

news18-telugu
Updated: January 26, 2020, 5:19 PM IST
టీడీఎల్పీ భేటీలో జగన్ గురించి రెండు సినిమా క్లిప్పింగ్స్... ఆ కమెడియన్‌తో పోలుస్తూ...
అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్
  • Share this:
తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి రెండు సినిమా క్లిప్పింగ్స్‌ను ప్రదర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానులను తీసుకురావాలని నిర్ణయించిన తరుణంలో గతంలో ఇలాంటి అంశాలు ఉన్న సినిమాల క్లిప్పింగ్‌లను టీడీఎల్పీలో ప్రదర్శించారు. మహమ్మద్ బీన్ తుగ్లక్, హింసించే రాజు 23వ పులికేసి సినిమాలకు సంబంధించిన క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు. ఢిల్లీ నుంచి దౌలతాబాద్‌కు రాజధానిని తరలించిన మహమ్మద్ బీన్ తుగ్లక్‌తో జగన్‌ను పోల్చారు. అలాగే, తమిళ కమెడియన్ వడివేలు నటించిన హింసించే రాజు 23వ పులికేసి సినిమాల్లోని క్లిప్పింగ్‌లను కూడా ప్రదర్శించారు. ఈ రెండు సినిమాల్లోని సన్నివేశాలను చూసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పగలబడి నవ్వుకున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఇలాగే ఉందంటూ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించారు.

అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ సందర్భంగా 22వ తేదీన ఏపీ శాసనమండలిలో రచ్చ రచ్చ జరిగింది. అధికార పార్టీకి చెందిన వారు, ప్రతిపక్ష సభ్యులు కూడా పోటాపోటీగా ఆందోళనలు తెలిపాయి. ఈ క్రమంలో శాసనమండలి గ్యాలరీలో కూర్చున్న చంద్రబాబునాయుడు అతడు సినిమాలో చూపించినట్టు వేలితో సైగలు చేస్తూ మండలి చైర్మన్ షరీఫ్‌ను నియంత్రించారని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.

మరోవైపు టీడీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారు. శమంతకమణి, తిప్పేస్వామి, సరస్వతి, కేఈ ప్రభాకర్, శత్రుచర్ల సమావేశానికి హాజరుకాలేకపోతున్నామని తెలిపారు. రేపు జరిగే అసెంబ్లీ సమావేశానికి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. తమ ఎమ్మెల్సీలను వైసీపీ ప్రలోభపెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందన్న కారణంతో టీడీపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మండలి గురించి శాసనసభలో చర్చించడం రాజ్యాంగ విరుద్ధమని టీడీపీ అభిప్రాయపడింది.

First published: January 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు