• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TDP NATIONAL PRESIDENT CHANDRABABU NAIDU WILL BE FILE A PETITION IN AP HIGH COURT AGAINST CID CASES NGS

Andrah Pradesh: సీఐడీ కేసులపై టీడీపీ కీలక నిర్ణయం.. ఈ నెల23న ఏం జరగబోతోంది? అరెస్ట్ తప్పదా?

Andrah Pradesh: సీఐడీ కేసులపై టీడీపీ కీలక నిర్ణయం.. ఈ నెల23న ఏం జరగబోతోంది? అరెస్ట్ తప్పదా?

చంద్రబాబు, అమరావతి లోగో, నారాయణ

సీఐడీ నోటీసులపై టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుటుంది? ఈ నెల 23న విచారణకు హాజరవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారా? లేక న్యాయ పరంగా స్టే తెచ్చుకునే అవకాశం ఉందా? ఒక వేళ 23న సీఐడీ విచారణకు చంద్రబాబు హాజరైతే అరెస్ట్ తప్పదా? ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ పెంచుతున్న అంశాలు ఇవే.

  • Share this:
    ఏపీ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా మారాయి. ప్రస్తుతం ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా అందరి దృష్టి ఇక్కడ రాజకీయాలపైనే పడింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడంతో ఏం జరుగుతోందనే అనుమానాలు పెరుగుతున్నాయి. అంతే కాదు ఈ నెల 23న తప్పకుండా విచారణకు హాజరు కావాలని లేదంటే అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీఐడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.. ఇటు మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు కూడా చేశారు. దీంతో ఏదో జరుగుతోందనే ఉత్కంఠ అందరిలో పెరుగుతోంది..

    మరోవైపు తనకు వచ్చిన సీఐడీ నోటీసులపై హైకోర్టుకు వెళ్లే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం న్యాయనిపుణులతో సమావేశమైన చంద్రబాబు.. వారి దగ్గర నుంచి సలహాలు తీసుకున్నారు. వారి సలహా ప్రకారం గురువారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తనపై నమోదైన కేసుకు సంబంధించిన.. ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలని కోరనున్నట్లు సమాచారం.

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో పెద్ద ఎత్తున్న భూకుంభకోణానికి తెర తీశారని తెలుగుదేశం అధినేత,నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఆరోపణలు చేస్తోంది. దీనిపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విజయవాడ నుంచి మంగళవారం ఉదయం 8 గంటలకు రెండు బృందాలుగా హైదరాబాద్ వెళ్లిన సీఐడీ అధికారులు జూబ్లిహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి చేరుకుని.. రాజధానిలో అసైన్డ్‌ భూముల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో విచారణకు సంబంధించి నోటీసులు అందజేశారు.ద్రబాబుతో పాటు మరో కీలక నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు కూడా సీఐడీ నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా 41 సీఆర్పీసీ కింద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్టు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. అలాగే మార్చి 23న తమ ముందు హాజరై పూర్తి వివరాలు అందించాలని ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబు నాయుడుకి నోటీసులు జారీ చేశారు. అటు మంత్రి నివాసాల్లో సోదాలు కూడా నిర్వహించారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్యకు మరోసారి నోటీసులు ఇచ్చారు.

    ఈ నోటీసులపై ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీలోని కీలక నేతలతో చర్చించారు. న్యాయవాదులు ఇచ్చిన సలహాలను వారికి వివరించారు. వారి సూచన మేరకు నోటీసులపై విచారణకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్టు వివరణ ఇచ్చారు. సిఐడి నోటీసులపై గురువారమే కోర్టును ఆశ్రయించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తొంది. కేసు కొట్టివేత కోసం క్వాష్ పిటిషన్ వేసే అంశంపై కూడా చర్చించినట్టు సమాచారం. అరెస్టులు లేకుండా విచారణ జరిగేలా చూడాలని కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. అయితే మరి ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించి విచారిస్తుందా? లేదా సీఐడీ విచారణకు హాజరవ్వాలని స్పష్టం చేస్తుందా అన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. .

    ఒకవేళ తప్పకుండా విచారణకు చంద్రబాబు హాజరుకావాల్సి వస్తే.. అరెస్ట్ అవుతారనే భయపడుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు తప్పు చేయకుంటే విచారణకు హాజరుకాకుండా ఎందుకు స్టే తెచ్చుకుంటున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.  మరోవైపు 23 నెంబర్ సెంటిమెంట్ కూడా టీడీపీ నేతలను వెంటాడుతోంది.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు