జగన్‌పై ఫిర్యాదుకు టీడీపీ ఢిల్లీ వ్యూహం.. రేపు హస్తినకు ఎంపీలు..

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు.

news18-telugu
Updated: July 15, 2020, 9:16 PM IST
జగన్‌పై ఫిర్యాదుకు టీడీపీ ఢిల్లీ వ్యూహం.. రేపు హస్తినకు ఎంపీలు..
సైకిల్ (టీడీపీ గుర్తు)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను టీడీపీ ఎంపీలు కలవనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతిని టీడీపీ ఎంపీలు కలుస్తారు. 13నెలలుగా రాష్ట్రంలో పరిణామాలను రాష్ట్రపతికి ఎంపీలు నివేదించనున్నారు. ప్రాథమిక హక్కులు కాలరాయడం, భావ ప్రకటనా స్వేచ్ఛ కాలరాయడం, రూల్ ఆఫ్ లా ఉల్లంఘించడం, రాజ్యాంగ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు చేస్తున్నహింసా విధ్వంసాలు, ఇళ్ల కూల్చివేత, ఆస్తుల ధ్వంసం, భూములు లాక్కోవడం, తోటల నరికివేత, బోర్ వెల్స్ ధ్వంసం, బీసీ, ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటీలపై దౌర్జన్యాల గురించి రాష్ట్రపతికి వివరిస్తారు. అంతేకాకుండా టీడీపీతో సహా ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై దాడులు, తప్పుడు కేసులు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, దళితులపై అమానుషాలు, మానవ హక్కుల ఉల్లంఘన గురించి సాక్ష్యాధారాలతో సహా రాష్ట్రపతి దృష్టికి టీడీపీ ఎంపీల బృందం తేనుంది.

ఏపీలో టీడీపీకి ముగ్గురు లోక్ సభ ఎంపీలు ఉన్నారు. కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ఉన్నారు. రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు. వారితోపాటు మరికొందరు నేతలు కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలిసింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 15, 2020, 9:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading