Home /News /politics /

TDP MPS READY FOR RESIGNATION AGAINST STEEL PLANT PRIVATIZATION TAKE DECISION IN MEETING WITH CHANDRA BABU NAIDU NGS

TDP MP: రాజీనామాకు సిద్ధమైన టీడీపీ ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాల్లోనే నిర్ణయం

రామ్మోహన్ నాయుడు

రామ్మోహన్ నాయుడు

టీడీపీ ఎంపీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి అన్నదానిపై అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో రాజీనామాలపై చర్చించారు..

    టీడీపీ ఎంపీలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా అధినేత చంద్రబాబుతో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. ఉభయ సభల్లో ఎలా వ్యవహరించాలి.. ఏఏ అంశాల్లో కేంద్రాన్ని ప్రశ్నించాలి.. కేంద్రంతో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలి అన్నదానిపై అధినేత ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. మొత్తం 18 అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా, జలవివాదాలపైనే ప్రత్యేకంగా వీరి మధ్య చర్చ జరిగింది. ఈ అంశాలపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని.. అందుకోసం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అధికార వైసీపీ ఎంపీలు ఇదే అంశాలపై పోరాటం చేస్తే కలిసి వెళ్లాలని.. లేదా ఒంటరిగా అయినా పోరాటం చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

    ఈ సమావేశం తరువాత మాట్లాడిన ఎంపీ రామ్మోహన్ నాయుడు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వంద శాతం ప్రయత్నం చేస్తామన్నారు. అవసరమైతే ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఇందే అంశం అజెండాగా టీడీపీ నేతలు అంతా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని.. మరి వైసీపీ ఎంపీలు అందుకు సిద్ధంగా ఉండగలరా అని సవాల్ విసిరారు. ఇటీవల విశా స్టీల్ ప్లాంట్ ఉద్యమ సంఘాల నేతలు.. ఎంపీలను అందరినీ కలిసి ప్రవేటీకరణకు వ్యతిరేకంగా లోక్ సభలో పోరాటం చేయాలని కోరారు. వైసీపీ ఎంపీలు సైతం ఉక్కు కార్మికులతో భేటీ అయ్యి.. ప్రభుత్వం తరుపున అన్ని విధాల పోరాటం చేస్తామన్నారు. ఇటు టీడీపీ ఎంపీలు కూడా స్టీల్ఓ కార్మికులకు భరో ఇచ్చారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించాలని.. అవసరం అనుకుంటే పదవులకు రాజీనామా చేసేందుకు కూడా వెనకాడ కూడదని టీడీపీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అ విశాఖ స్టీల్‌పై ముందుండి సీఎం జగన్ పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ఆస్తులు హైదరాబాద్‌లో ఉన్నాయని, అందుకే జల వివాదంపై మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను పోరాడి సాధిస్తామని రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు.

    ఇదీ చదవండి: వైఎస్ వల్లే చైర్మన్ అయ్యా.. చంద్రబాబును అలా చూడడమే టార్గెట్.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

    చంద్రాబాబుతో జరిగిన ఈ సమావేశానికి ఎంపీ జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర హాజరయ్యారు. దాదాపు 18 అంశాలపై పార్లమెంటరీ పార్టీ భేటీలో చర్చించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, జల వివాదంపై చర్చించారని టీడీపీ నేతలు తెలిపారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chandrababu naidu, Jayadev Galla, Kesineni Nani, Rammohan naidu, Tdp, Vizag Steel Plant

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు