Home /News /politics /

TDP MPS ON CENTRE OVER RAILWAY ZONE

‘జోన్ మీద నిర్ణయం తీసుకోలేని వాళ్లు దేశాన్నేం పాలిస్తారు?’

మీడియాతో మాట్లాడుతున్న టీడీపీ ఎంపీలు

మీడియాతో మాట్లాడుతున్న టీడీపీ ఎంపీలు

పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తమ పోరాటం కొనసాగిస్తామని ఎంపీలు స్పష్టం చేశారు.

    ఒక్క చిన్న రైల్వేజోన్ అంశం మీద నాలుగేళ్లుగా నానుస్తూ రాజకీయ నిర్ణయం తీసుకోలేని వాళ్లు ఇక దేశాన్నేం పాలిస్తారంటూ టీడీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్ ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన మూడు రోజుల తర్వాత అదే కేంద్ర హోంశాఖ తరఫున సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో రైల్వేజోన్ సాధ్యంకాదని తెలిపింది. దీనిపై టీడీపీ ఎంపీలు మండిపడ్డారు. ఓ వైపు మంత్రి సభలో హామీ ఇవ్వడం, మరోవైపు సుప్రీంకోర్టులో మాత్రం దానికి వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేయడాన్ని తప్పుపట్టారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ప్రయత్నిస్తోందని, అసలు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏం చేయాలనుకుంటుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

    కేంద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాతే ఏపీ ప్రభుత్వం యూషీలు గుర్తు వచ్చాయా అని టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇన్నాళ్లూ గుర్తు ఎందుకు రాలేదని, ఇది ఓ రకంగా కక్షసాధింపు ధోరణిలా ఉందన్నారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైఖరిని టీడీపీ ఎంపీలు తప్పుపట్టారు. కడపకు స్టీల్ ప్లాంట్‌పై కొర్రీలు పెట్టకుండా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీతో కలసి బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఎంపీలు అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తమ పోరాటం కొనసాగిస్తామని ఎంపీలు స్పష్టం చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Bjp, Kadapa steel factory, Tdp, Visakha Railway Zone

    తదుపరి వార్తలు