రాష్ట్రపతిని కలిసిన టీడీపీ ఎంపీలు.. సీఎం జగన్ పాలనపై ఫిర్యాదు

ఏపీలో 13 నెలల కాలంలో దాడులు పెరిగిపోయాయని ఎంపీలు కేశినేని నాని, జయదేవ్ గల్లా, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: July 16, 2020, 3:03 PM IST
రాష్ట్రపతిని కలిసిన టీడీపీ ఎంపీలు.. సీఎం జగన్ పాలనపై ఫిర్యాదు
రాష్ట్రపతికి టీడీపీ ఎంపీల ఫిర్యాదు
  • Share this:
టీడీపీ ఎంపీల బృందం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఏపీలో 13 నెలల కాలంలో దాడులు పెరిగిపోయాయని ఎంపీలు కేశినేని నాని, జయదేవ్ గల్లా, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఎంపీ గల్లా జయదేవ్ 52 పేజీలతో కూడిన లేఖను రాష్ట్రపతికి సమర్పించారు. వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వేదిక కూల్చవేత మొదలు.. అచ్చెన్నాయుడు అరెస్ట్ వరకు అన్ని వివరాలను అందులో పొందుపరిచారు. తాము చెప్పిన విషయాలను రాష్ట్రపతి సావధానంగా విన్నారని, తన పరిధిలో తీసుకోగలిగే చర్యలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు టీడీపీ ఎంపీలు వెల్లడించారు.

'' ఏపీలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులు, శాంతిభద్రతలకు సంబంధించిన అన్ని అంశాలు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాం. రాజ్యాంగ సంస్థల విధ్వంసం, ప్రాథమిక హక్కులను హరించడం, టీడీపీ నేతలపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం, శాంతి భద్రతల పేరుతో ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, 3 రాజధానుల పేరుతో అమరావతిని చంపేయడం వంటి అంశాలతో పాటు ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాం.'' అని ఎంపీ కనకమేడల తెలిపారు.
Published by: Shiva Kumar Addula
First published: July 16, 2020, 1:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading