Home /News /politics /

TDP MPS DEMANDS RAILWAY ZONE HERE IS RAILWAY MINISTER PIYUSH GOYAL REPLY

టీడీపీ ఎంపీల రైల్వే జోన్ డిమాండ్...రైల్వే మంత్రి లేటెస్ట్ సమాధానం ఇదీ

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ (ఫైల్ ఫోటో)

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ (ఫైల్ ఫోటో)

పార్లమెంటు ఆవరణలో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్...ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడుతుండగా రైల్వే జోన్ అంశంపై సమాధానం చెప్పాలని ఏపీ ఎంపీలు నినాదాలు చేశారు.

    విశాఖ రైల్వే జోన్ డిమాండ్‌పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. విశాఖ‌లో రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.  ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీలు నిరసన తెలుపుతున్న సమయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ ఎంపీ జీవీఎల్ అక్కడకు చేరుకున్నారు. మీడియా ప్రతినిధులను పిలిపించుకుని మాట్లాడారు. ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు టీడీపీ అంగీకరించిందని గోయల్ గుర్తు చేశారు. ఆ తర్వాత టీడీపీ మాట మార్చిందని విమర్శించారు. ఏపీలో జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చేందుకే ఆందోళన పేరిట టీడీపీ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో టీడీపీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని, ఏపీ ప్రజలు కూడా వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు.

    గోయల్‌ మీడియాతో మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు జోక్యం చేసుకుని..ప్యాకేజీ అంశంపై కాకుండా విశాఖ రైల్వే జోన్ అంశంపై సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. రైల్వే జోన్‌ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని గోయల్‌ వారికి సమాధానమిచ్చారు.
    Published by:Janardhan V
    First published:

    Tags: Piyush Goyal, Visakha Railway Zone

    తదుపరి వార్తలు