‘నాకొక సీటు... నా కుమారుడికి మరో సీటు’… టీడీపీలో సీనియర్ నేత లాబీయింగ్

గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన రాయపాటి సాంబశివరావు... టీడీపీ తరపున నరసరావుపేట ఎంపీగా విజయం సాధించారు. అయితే తన రాజకీయ వారసుడిగా తన కుమారుడు రంగారావును తెరపైకి తీసుకురావాలని భావిస్తున్న రాయపాటి... కుమారుడి టికెట్ కోసం అవసరమైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాననే సంకేతాలు ఇచ్చారు.

news18-telugu
Updated: March 7, 2019, 11:42 AM IST
‘నాకొక సీటు... నా కుమారుడికి మరో సీటు’… టీడీపీలో సీనియర్ నేత లాబీయింగ్
టీడీపీ ఎన్నికల గుర్తు
  • Share this:
ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేస్తున్న చంద్రబాబు... పార్టీకి ఎంతో కీలకమైన గుంటూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ వైసీపీ పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్న చంద్రబాబు... జగన్ పార్టీకి కౌంటర్ ఇచ్చే క్రమంలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నరసరావుపేట ఎంపీ, సీనియర్ రాజకీయ నేత రాయపాటి సాంబశివరావు రిక్వెస్ట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన రాయపాటి సాంబశివరావు... టీడీపీ తరపున నరసరావుపేట ఎంపీగా విజయం సాధించారు.

అయితే తన రాజకీయ వారసుడిగా తన కుమారుడు రంగారావును తెరపైకి తీసుకురావాలని భావిస్తున్న రాయపాటి... కుమారుడి టికెట్ కోసం అవసరమైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. అయినా తనకు ఆరోగ్యం సహకరించడం లేదని... కాబట్టి తాను తప్పుకుని తన కుమారుడికి రాజకీయాల్లో అవకాశం కల్పించాలని అనుకుంటున్నానని వివరించారు. అయితే ఇప్పుడు రాయపాటి మనసు మారినట్టు గుంటూరు జిల్లా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్‌తో పాటు తనకు మరోసారి ఎంపీగా అవకాశం కల్పించాలని ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును కోరినట్టు తెలుస్తోంది.

తన కుమారుడు రంగారావుకు సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన టీడీపీ అధినాయకత్వం వద్ద లాబీయింగ్ చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకుల కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వడం వల్ల విమర్శలు వస్తాయని భావిస్తున్న చంద్రబాబు... దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి తనతో పాటు తన కుమారుడి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సీనియర్ రాజకీయ నేత రాయపాటి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

First published: March 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు