TDP MP RAMMOHAN NAIDU SAYS WE ARE READY TO REGAINS AGAINST STEEL PLANT PRIVATIZATION IF YCP MPS ARE READY OR NOT NGS
Andhra Pradesh: మేం రాజీనామాలు చేస్తున్నాం.. వైసీపీ ఎంపీలకు రామ్మోహన్ నాయుడు సవాల్..
రామ్మోహన్ నాయుడు (ఫైల్)
ఏపీలో మళ్లీ రాజీనామా సవాళ్లు మొదలయ్యాయి.. హస్తిన వేదిక టీడీపీ-వైసీపీ ఎంపీలు ఢీ అంటే ఢీ అంటున్నారు. తాము రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని.. వైసీపీ ఎంపీల సంగతి ఏంటని రామ్మోహన్ నాయుడు నిలదీశారు..
YCP Vs TDP: ఏపీలో రాజకీయం హీటెక్కింది. ప్రస్తుతం హస్తినలో ఏపీ రాజకీయాలు హీటు పుట్టిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండడంతో దేశ రాజధాని ఢిల్లీలో వైసీపీ, టీడీపీ ఎంపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే సమయంలో విశాఖ ఉక్కు ఉద్యమ నేతలు..ఢిల్లీకి చేరుకున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంలో కేంద్రం ముందుకే వెళ్తుండడంతో అక్కడే ఉండి పోరాడాలని నిర్ణయించాయి. ఆ నేతలు ఇటు వైసీపీ ఎంపీలు, అటు టీడీపీ ఎంపీలను కలుస్తునే ఉన్నారు. అక్కడి ఎంపీల లాబీయింగ్ తో విశాఖ ఉక్కు పోరాట కమిటీని కేంద్ర పెద్దల దగ్గరకు తీసుకెళ్తున్నా ఎలాంటి హామీ లభించడం లేదు. మరోవైపు టీడీపీ-వైసీపీ ఎంపీల మధ్య మాత్రం మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. నిన్న చంద్రబాబు నాయుడు సైతం విశాఖ ఉక్కు పోరాట కమిటీకి లేఖ రాశారు. తమ ఎంపీలు అంతా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఉక్కు ఉద్యమానికి సీఎం జగన్ నాయకత్వం వహిస్తేనే ఫలితం ఉంటుందంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు.
తాజాగా వైసీపీకి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సవాల్ విసిరారు. వైసీపీ ఎంపీలు గుంపులో గోవిందలా పార్లమెంట్ లో వ్యవహరిస్తున్నారని విమర్శించిన ఆయన.. ప్రజలను మభ్య పెట్టడానికి పార్లమెంట్ లో హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆరోపించిన ఆయన.. వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదు.. ఎవరు ఎప్పుడే ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు.. నాలుగు ఫోటోలు తీసుకోవడానికే హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తోందని దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు చేయడానికైనా మేం సిద్ధ
మయ్యామని.. మరి వైసీపీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులు అందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ ఆయన డిమాండ్ చేశారు.. రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా వస్తుందన్నారు.. మేం రాజీనామాలు చేస్తాం.. వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు సిద్ధమా? అని ప్రశ్నించారు.
రాష్ట్రానికి అన్ని విధలా నష్టం జరుగుతుంటే వైసీపీ ఎంపీలు ఈ రెండేళ్లు ఏంచేశారని ప్రశ్నించారు. ఇప్పుడే ఎందుకు నిద్ర లేచారని..? ప్రశ్నించారు రామ్మోహన్ నాయుడు.. ఎంపీ రఘురామకృష్ణరాజు పై అనర్హత వేటు వేయించడానికి డ్రామా ఆడుతున్నారన్న ఆయన.. ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేస్తున్న పోరాటమేంటో… మమ్మల్ని ఏం సాయం అడిగారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల విమర్శలకు మేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న ఆయన.. మేం పార్లమెంట్లో చేస్తున్న పోరాటమేంటో ప్రజలే గమనిస్తున్నారని.. నిరూపించుకోవాల్సిన బాధ్యత వైసీపీ పార్టీ పైనే ఉందన్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.