AP Drugs Isue: డ్రగ్స్ తో వైసీపీ ఎమ్మెల్యేకి లింక్.. టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

ఎంపీ రామ్మోహన్ నాయుడు (ఫైల్)

AP Politics: హెరాయిన్ (Heroin) కేసులో అరెస్టైన సుధాకర్ సొంత ఊరు ద్వారపూడి అయినందున అక్కడ వైసీపీ ఎమ్మెల్యేకి (YCP MLA)... నిందితుడికి ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో విచారించాలని డిమాండ్ చేశారు.

 • Share this:
  డ్రగ్స్ వ్యవహారం (Drugs Issue) ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) దుమారం రేపుతోంది. గుజరాత్ పోర్టులో పట్టుబడ్డ హెరాయిన్ కు విజయవాడ (Vijayawada)తో లింక్ ఉన్నట్లు తేలడంతో రాజకీయ పార్టీల (Political Parties) మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress).. ఇటు తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. డ్రగ్స్ దందాకు టీడీపీ కేరాఫ్ అడ్రస్ అని వైసీపీ అంటుంటే... ఏపీని డ్రగ్స్ కు అడ్డాగా మార్చారని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ఇటు మంత్రులు.. అటు టీడీపీ నేతత ఆరోపణలు, ప్రత్యారోపణలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు (MP Kinjarapu Ram Mohan Naidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైపీసీ ప్రజాప్రతినిథులతో పాటు పోలీసులపైనా మాటల తూటాలు పేల్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy)పైనా తీవ్ర విమర్శలు చేశారాయన.

  ఆధారాలతోనే మాట్లాడుతున్నాం..
  శనివారం మీడియాతో మాట్లాడిన ఎంపీ రామ్మోహన్ నాయుడు.. ఏ అంశంపై అయినా టీడీపీ తప్పుడు ఆరోపణలు చేయదని.., అన్ని సాక్షాధారాలతో టీడీపీ మాట్లాడుతుందనేది డీజీపీ గుర్తు పెట్టుకోవాలని అని అన్నారు. ఏపీలో డ్రగ్స్ మాఫియా నడుస్తోందని ఆరోపించిన ఆయన.. ఏపీలో పోలీసు శాఖ ఎవరి కోసం పని చేస్తుందని ప్రశ్నించారు. టీడీపీని మాట్లాడవద్దని చెప్పడానికి డీజీపీ ఎవరని నిలదీసిన రామ్మోన్ నాయుడు.. డీజీపీ, ఎస్పీలు, కమిషనర్‌లు ప్రభుత్వాన్ని వెనకేసుకుని వస్తే ప్రతిపక్షానికి పోలీసు వ్యవస్థపై నమ్మకం ఎలా కలుగుతుందని ప్రశ్నించారు. పోలీసులు పబ్లిక్‌కి సేవ చేయాలి కానీ పార్టీలకు కాదని హితువుపలికారు.

  ఇది చదవండి: నగరిలో ఎమ్మెల్యే రోజాకు తప్పని తలనొప్పులు.. ఆమెను టార్గెట్ చేస్తోంది ఆయనేనా..?


  సీఎంవి క్రిమినల్ ఐడియాలు..
  ఇక ఇటీవల చర్చనీయాంశమైంన హెరాయిన్ అంశంలో ‘‘ఈవే’’ బిల్లులు బయటకి తీయాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. సీఎం జగన్ వన్నీ క్రిమినల్ ఐడియాలని ఆరోపించారు. అలాగే హెరాయిన్ కేసులో అరెస్టైన సుధాకర్ సొంత ఊరు ద్వారపూడి అయినందున అక్కడ వైసీపీ ఎమ్మెల్యేకి... నిందితుడికి ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో విచారించాలని డిమాండ్ చేశారు. జగన్ చెప్పిన ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించారు.

  ఇది చదవండి: ఏపీకి తుఫాన్ ముప్పు... ఈ జిల్లాలు అలర్ట్... మూడు రోజులు జాగ్రత్త..


  బ్లాక్ మనీ ఎక్స్ పోర్ట్..
  డ్రగ్స్‌ వ్యవహారంపై తాము రాజకీయం చేయడం లేదని.. ఏపీ భవిష్యత్తు తమకు ముఖ్యమని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోకి డ్రగ్స్ ఇంపోర్ట్ అవుతూ... ఇక్కడి నుంచి బ్లాక్ మనీ ఎక్స్ పోర్ట్ అవుతుందని ఆరోపించారు. డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు తమ వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్ చేసిన ఎంపీ... ఎందుకు పోలీసులు దర్యాప్తు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ ట్రేడింగ్ కంపెనీ వెనుక వైసీపీ నాయకులు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇక సీఎం జగన్ కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడగకుండా తాడేపల్లిలో దాక్కున్నారని రామ్మోహన్ నాయుడు ఎద్దేవా చేశారు. పాదయాత్రలో కాలుబెణనకి జగన్ కు... ఢిల్లీ అంటే కాలు బెణికిందా అని ప్రశ్నించారు.
  Published by:Purna Chandra
  First published: