ఏపీలో ఉన్నట్టుండి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేసింది ప్రభుత్వం. ఎల్వీ స్థానంలో ఇన్ఛార్జి సీఎస్ గా నీరబ్ కుమార్ ను నియమించింది. మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేశారు. తక్షణమే విధుల నుంచి తప్పుకుని, నీరబ్ కుమార్ కు బాధ్యతలను అప్పగించాలని సుబ్రహ్మణ్యంకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే అప్పుడు దీనిపై ప్రతిపక్షం పార్టీ సెటైర్లు షురూ చేసింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. ‘ ప్రిన్సిపాల్ సెక్రటరీపై చీఫ్ సెక్రటరీ షోకాజు నోటీసులు ఇస్తే... ప్రిన్సిపాల్ సెక్రటరీ... చీఫ్ సెక్రటరీనే బదిలీ చేయించారు.. శుభాకాంక్షలు ’ అంటూ ఎద్దేవా చేస్తూ కేశినేని నాని తన ట్వీట్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఏపీ ప్రిన్సిపాల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మధ్య వివాదాలు చెలరేగినట్లు తెలుస్తొంది. దీంతో ఎల్వీని బదిలీ చేస్తూ ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఇటీవల కాంలో సీఎం, సీఎ మధ్య కూడా కొన్ని వ్యవహారాల్లో గ్యాప్ పెరిగినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ జారీ చేసిన జీవోపై సీఎస్ ఎల్వీ అభ్యంతరం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది.
#AndhraPradesh
Chief secretary gives show cause notice to Principal Secy...Next Principal Secy transfers Chief Secy!congratulations👏👏👏👏👏@ysjagan@AndhraPradeshCM
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.