అమరావతిపై టీడీపీ ఎంపీ కొత్త వాదన.. సొంత పార్టీ నేతలకు చురకలు ?

ప్రతీకాత్మక చిత్రం

Kesineni Nani: ఓ వైపు టీడీపీ నేతలంతా అధికార వైసీపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంటే... కేశినేని నాని మాత్రం 2024 అంశాన్ని ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.

  • Share this:
    ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు బిల్లు అంశాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్న టీడీపీ నేతలు.. వైసీపీపై రాజకీయ విమర్శలను మరింత తీవ్రం చేశారు. అమరావతిపై నిర్ణయం సరైనదని వైసీపీ భావిస్తే... ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పు కోరాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. టీడీపీ నేతలందరూ ఇదే రకమైన డిమాండ్ వినిపిస్తున్నారు. అయితే ఈ అంశంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని భిన్నమైన స్వరం వినిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మన కలలు మనమే సాకారం చేసుకోవాలని... మన కలలు ఎదుటి వారు సాకారం చేయాలని కోరుకోవడం అవివేకమని కేశినేని నాని ట్వీట్ చేశారు. అమరావతి అనేది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు కన్న కల అని... అది సాకారం కావాలంటే 2024లో టీడీపీ అధికారంలోకి రావాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆ దిశగా పార్టీలో అందరూ పాటుపడాలి మీడియా సమావేశాల వల్ల పేపర్ స్టేట్మెంట్స్ వల్ల ప్రయోజనం లేదని కేశినేని నాని కామెంట్ చేయడం గమనార్హం.    ఓ వైపు టీడీపీ నేతలంతా అధికార వైసీపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంటే... కేశినేని నాని మాత్రం 2024 అంశాన్ని ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆయన మీడియా సమావేశాల వల్ల పేపర్ స్టేట్మెంట్స్ వల్ల ప్రయోజనం లేదని చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవే అంశం కూడా రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఆయన కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు దేవినేని ఉమ, బుద్ధా వెంకన్నపై విమర్శలు చేశారు. దీంతో ఈ అంశంపై మీడియాలో పదే పదే మాట్లాడుతున్న దేవినేని ఉమ, బుద్దా వెంకన్నను ఉద్దేశించే కేశినేని ఉమ ఈ కామెంట్స్ చేశారేమో అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: