HOME »NEWS »POLITICS »tdp mp kesineni nani slams ap cm ys jagan over municipal elections sk

విజయవాడ నుంచే జగన్ పతనం ఆరంభం.. ఎంపీ కేశినేని వార్నింగ్

విజయవాడ నుంచే జగన్ పతనం ఆరంభం.. ఎంపీ కేశినేని వార్నింగ్
సీఎం జగన్,ఎంపీ కేశినేని నాని(File Photos)

కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ పీఠంతో పాటు విజయవాడ కార్పొరేషన్ గెలుస్తున్నామని ధీమావ్యక్తం చేశారు టీడీపీ ఎంపీ. 75 శాతం సీట్లు గెలవబోతున్నామన్న ఆయన.. జగన్ ఎంత మంది మంత్రులతో రాజీనామా చేయిస్తారో చూద్దామని అన్నారు.

 • Share this:
  ఏపీ సీఎం జగన్‌పై విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్వార్థం కోసం మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు నాని. కేసులకు భయపడి బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని.. కేంద్రం మెడలు వంచుతానని చెప్పి కాళ్లు పట్టుకుటున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలతోనే జగన్ పతనం మొదలవుతుందని అన్నారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ పీఠంతో పాటు విజయవాడ కార్పొరేషన్ గెలుస్తున్నామని ధీమావ్యక్తం చేశారు టీడీపీ ఎంపీ. 75 శాతం సీట్లు గెలవబోతున్నామన్న ఆయన.. జగన్ ఎంత మంది మంత్రులతో రాజీనామా చేయిస్తారో చూద్దామని అన్నారు.
  ''సీఎంగా జగన్ ఫెయిల్ అయ్యారు. జగన్ స్వార్థం కోసం మూడు రాజధానులు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలు నాశనం అవ్వాలని జగన్ ఎందుకు కోరుకుంటున్నారు. రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు. ప్రతి ఒక్కరు జగన్‌కి బుద్ధి చెప్పండి. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్‌లను టీడీపీ గెలుస్తుంది. నిజంగా ప్రజలు నీ పక్షాన ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయి. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలతోనే జగన్ పతనం మొదలవుతుంది.'' అని కేశినేని నాని అన్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:March 10, 2020, 16:51 IST

  टॉप स्टोरीज