కోడెలది ముమ్మాటికీ హత్యే.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

కోడెల శివప్రసాదరావు(ఫైల్ ఫోటో)

కోడెల మృతి కేంద్రంగా టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Share this:
    మాజీ స్పీకర్ కోడెల మరణంపై అప్పుడే రాజకీయ దుమారం మొదలైంది. వైసీపీ ప్రభుత్వం రాజకీయ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కోడెల ఉరివేసుకుంటే వేరే ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. క్యాన్సర్ ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారని మంత్రి బొత్స అన్నారు. ఆయన మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇలా కోడెల మృతి కేంద్రంగా టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    కోడెల శివప్రసాదరావుది ఆత్మహత్య కాదని.. సీఎం వైఎస్ జగన్ ఆయన్ను క్రూరంగా హత్య చేశారని సంచలన ఆరోపణలు చేశారు కేశినేని నాని. మరోవైపు కోడెల మృతిపై ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తన తండ్రి మృతిపై తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానాలు లేవని.. కోడెల కూతురు విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఒత్తిడిలో ఉండడం వల్లే ఆయన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.
    First published: