Vizag Gas Leak | ఏపీ మంత్రి రాజీనామాకు కేశినేని నాని డిమాండ్...

విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాజీనామా చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: May 7, 2020, 7:54 PM IST
Vizag Gas Leak | ఏపీ మంత్రి రాజీనామాకు కేశినేని నాని డిమాండ్...
విజయవాడ ఎంపీ కేశినేని నాని(ఫైల్ ఫోటో)
  • Share this:
విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాజీనామా చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్‌లో గ్యాస్ లీక్ కావడంతో ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కంపెనీ మీద 278, 284, 285, 337, 338, 304 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖలోని గోపాలపట్నం పోలీసులు ఈ కేసు ఫైల్ చేశారు. విషవాయువుతో వాతావరణాన్ని కలుషితం చేయడం, నిర్లక్ష్యం, మానవ జీవనానికి హాని కలిగించడం, పరిస్థితిని అదుపు చేయకపోవడంతోపాటు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిశ్రమల శాఖ అధికారుల మీదే కాకుండా, సంబంధిత మంత్రి మీద కూడా కేసులు నమోదు చేయాలని, అలాగే, మంత్రి రాజీనామా చేయాలని కేశినేని నాని డిమాండ్ చేశారు.

Published by: Ashok Kumar Bonepalli
First published: May 7, 2020, 7:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading