బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలపై కేశినేని విమర్శలు

బీజేపిలో చేరిన అనంతరం ఎంపి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ తాము బీజేపిలో చేరడానికి దారితీసిన పరిస్థితులపై, తమ నిర్ణయం వెనుకున్న కారణాలను విశ్లేషిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: July 6, 2019, 9:52 AM IST
బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలపై కేశినేని విమర్శలు
విజయవాడ ఎంపీ కేశినేని నాని
  • Share this:
రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎమ్ రమేష్, టీజీ వెంకటేష్ లపై ట్విట్టర్ లో ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు.  మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లోకి వెళుతున్నామని బిల్డప్ ఇచ్చారంటూ మండిపడ్డారు. కానీ, నిన్న కేంద్రం విడుదల చేసిన బడ్టెట్ చూశాక  ఏపీ రాష్ట్ర ప్రజలకు మీరెందుకు పార్టీ మారారో బాగా అర్ధమయ్యిందన్నారు. ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లోకి చేరారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోడానికి BJP లోకి చేరారో? అంటూ ఎంపీలపై విమర్శల దాడి చేశారు కేశినేని.

రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావు ఇటీవల బీజేపీలోకి చేరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే... తాము బీజేపీలో చేరామన్నారు సుజనా చౌదరి. బీజేపిలో చేరిన అనంతరం ఎంపి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ తాము బీజేపిలో చేరడానికి దారితీసిన పరిస్థితులపై, తమ నిర్ణయం వెనుకున్న కారణాలను విశ్లేషిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన హామీలు నెరవేరాలంటే బీజేపీతో కలిసి పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తూనే.. బీజేపీతో సంఘర్షిస్తే ఉపయోగం లేదని తేల్చిచెప్పారు. అంతేకాకుండా యావత్ భారతం ఎవరితో ఉందనే విషయం ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలతో తేలిపోయిందని స్పష్టంచేశారు.


First published: July 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు