సామాజిక దూరం పాటించలేదని టీడీపీ ఎంపీపై కేసు...

పేదలకు సాయం చేస్తుంటే దొంగ కేసులు బనాయించారంటూ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు.

news18-telugu
Updated: May 2, 2020, 10:34 PM IST
సామాజిక దూరం పాటించలేదని టీడీపీ ఎంపీపై కేసు...
విజయవాడ ఎంపీ కేశినేని నాని (ఫైల్ ఫోటో)
  • Share this:
కూరగాయలు పంపిణీ చేసే సమయంలో సామాజిక దూరం పాటించలేదంటూ టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ‘ఈనెల 1న విజయవాడలోని 47వ డివిజన్లో గుజ్జారి యల్లారావు కూరగాయల మార్కెట్ ఎదురుగా టీడీపీ ఎంపీ కేశినేని నాని, నాగుల్ మీరా, మరికొందరు టీడీపీ నాయకులు ప్రభుత్వ లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా, కనీస సామాజిక దూరం పాటించకుండా, పెద్ద ఎత్తున ప్రజలను జమ చేసి ప్రాణాంతక కరోనా వ్యాధి వ్యాప్తి చెందే విధంగా కూరగాయలు పంపిణీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఎఫ్ఐఆర్ నమోదు చేశాం.’ అని విజయవాడ సిటీ వెస్ట్ జోన్ ఏసీపీ ప్రకటన జారీ చేశారు. అయితే, దీనిపై కేశినేని నాని మండిపడ్డారు. వైసీపీ నేతలు సామాజిక దూరం పాటించకుండా కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కొన్ని ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి వారి మీద ఎన్ని కేసులు నమోదు చేశారని ప్రశ్నించారు.

కూరగాయలు పంపిణీ చేసిన కేశినేని నాని, నాగుల్ మీరా


‘కరోనా విపత్తు లో తిండి లేక అలమటిస్తున్న పేదలకుసహాయం చేస్తునందుకు దొంగ కేసులు బనాయించిన విజయవాడ సిటీ పోలీసులకు ధన్యవాదాలు. మీరు ఎన్ని దొంగ కేసులు పెట్టినా భయపడేది లేదు. ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకోవడం ఆపేది లేదు. ప్రజలు ఎన్నుకొన్నది వారు ఆపదలో వున్నపుడు ఇంట్లో కూర్చోవడానికి కాదు.’ అని కేశినేని నాని ట్వీట్ చేశారు.

Published by: Ashok Kumar Bonepalli
First published: May 2, 2020, 10:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading