ఆ తరువాతే కేంద్రంలో చేరాలి... వైసీపీకి టీడీపీ కండీషన్

తన కేసుల విషయంలో సహకరించాలని జగన్ కేంద్రాన్ని కోరుతున్నారని ఎంపీ కనకమేడల మండిపడ్డారు.

news18-telugu
Updated: February 15, 2020, 1:21 PM IST
ఆ తరువాతే కేంద్రంలో చేరాలి... వైసీపీకి టీడీపీ కండీషన్
సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో ఏం బేరాలు ఆడుతున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ వైసీపీని ప్రశ్నించారు. 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచుతామని ఆనాడు జగన్ అన్నారని ఆయన గుర్తుచేశారు. హోదా లేకపోతే రాష్ట్రమే లేదన్న జగన్... ఇప్పుడు ఆ మాట ఎందుకు ఎత్తడం లేదని ఆయన కనకమేడల విమర్శించారు. మండలి రద్దు, మూడు రాజధానులపై సానుకూల స్పందన రాలేదని వ్యాఖ్యానించారు. తన కేసుల విషయంలో సహకరించాలని జగన్ కేంద్రాన్ని కోరుతున్నారని ఎంపీ కనకమేడల మండిపడ్డారు. ఏపీ మంత్రి బొత్స ఎన్డీయేలో చేరతామంటున్నారని... దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

హోదాపై కేంద్రంతో ప్రకటన చేయించి వైసీపీ ఎన్డీయేలో చేరాలని కనడమేడల స్పష్టం చేశారు. కేంద్ర నిధులు, ప్రాజెక్ట్‌లు సాధించి ఎన్డీయేలో చేరితే ఎవరూ తప్పుబట్టరని వ్యాఖ్యానించారు.
First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు