జగన్ సరెండర్...అందులో కుట్ర ఉందన్న టీడీపీ ఎంపీ

అమరావతిపై ఏపీ మంత్రులు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల విమర్శించారు. ఆంధ్రులకు రాజధాని లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు.

news18-telugu
Updated: November 18, 2019, 12:11 PM IST
జగన్ సరెండర్...అందులో కుట్ర ఉందన్న టీడీపీ ఎంపీ
ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌తో రూ.5వేల కోట్ల నష్టం వాటిల్లిందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. పోలవరం రివర్స్‌ టెండర్‌ దక్కించుకున్నవారికే.. ఆర్టీసీలో బస్సుల టెండర్‌ రావడంలో మర్మమేంటో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రానికి జగన్‌ సరెండర్‌ అయ్యారని ఆయన ఆరోపించారు. అమరావతిపై ఏపీ మంత్రులు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆంధ్రులకు రాజధాని లేకుండా చేస్తున్నారని ఎంపీ కనకమేడల ధ్వజమెత్తారు.

పార్లమెంట్ సమావేశాలపై జరిగిన అఖిలపక్ష భేటీలోనూ వైసీపీ రాజకీయ అంశాలు ప్రస్తావించిందని టీడీపీ ఎంపీ కనకమేడల మండిపడ్డారు. పోలవరం అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామని అన్నారు. పోలవరాన్ని కేంద్రమే నిర్మించాలన్న డిమాండ్‌కు జగన్‌ కట్టుబడి ఉండాలన్నారు. ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లీష్‌ తీసుకురావడంలో కుట్ర దాగుందని టీడీపీ ఎంపీ కనకమేడల ఆరోపించారు. వైసీపీకి ఎందుకు ఓట్లు వేశామా అని ప్రజలు బాధపడుతున్నారని కనకమేడల పేర్కొన్నారు.

First published: November 18, 2019, 12:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading