హోమ్ /వార్తలు /politics /

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన జేసీ.. గో బ్యాక్ అంటూ గ్రామస్తుల ధర్నా

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన జేసీ.. గో బ్యాక్ అంటూ గ్రామస్తుల ధర్నా

తుంగభద్ర నీటిని తమకు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చారా? అని గ్రామస్తులు జేసీ దివాకర్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలను నిలదీశారు.

    అనంతపురం జిల్లా నార్పల మండలం కేసే పల్లి, నడిమి పల్లి, కూరగాయని పల్లి గ్రామాల్లో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతపురం ఎంపీ జేడీ దివాకర్ రెడ్డి అక్కడ ప్రచారం చేశారు. జేసీ దివాకర్ రెడ్డి, మరికొందరు టీడీపీ కార్యకర్తలు ఆ మూడు గ్రామాలకు చేరుకొని ప్రచారం నిర్వహిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. తుంగభద్ర నీటిని తమకు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చారా? అని గ్రామస్తులు జేసీ దివాకర్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలను నిలదీశారు. దీనితో జేసీ దివాకర్ రెడ్డి గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి అనుచరులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం నెలకొంది. చివరికి గ్రామస్తులు జేసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే తమ గ్రామాల నుంచి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. దీంతో జేసీ అనుచరులు వెనుదిరిగారు.

    First published:

    ఉత్తమ కథలు