ఢిల్లీకి టీడీపీ ఎమ్మెల్సీలు... అపాయింట్‌మెంట్ ఇవ్వని అమిత్ షా

Amit Shah Appointment: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం ఉద్దేశపూరకంగానే వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని అంటున్నారు టీడీపీ ఎమ్మెల్సీలు.

news18-telugu
Updated: February 18, 2020, 9:00 AM IST
ఢిల్లీకి టీడీపీ ఎమ్మెల్సీలు... అపాయింట్‌మెంట్ ఇవ్వని అమిత్ షా
అమిత్ షా, చంద్రబాబు
  • Share this:
ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటోన్న సంచనల నిర్ణయాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి రెడీ అవుతోంది. మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఇప్పటికే అమరావతి రైతులు ఆందోళనలు కొనసాగిస్తోన్నారు. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీలు సైతం పార్లమెంట్ సమావేశాల సమయంలో లేవనెత్తారు. అయితే ఈ పోరాటాన్ని ఇప్పటికే ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లిన టీడీపీ.. ఇక శాసన మండలిని ప్రొరోగ్ చేయడంపై హస్తిన పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. దీనిపై దేశ రాజధానిని కేంద్రంగా చేసుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పలువురు టీడీపీ నేతలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కలిసే అవాకశం లభించినా... మిగిలినా పెద్దల అపాయింట్ మెంట్  మాత్రం టీడీపీ ఎమ్మెల్సీలు, నాయకులకు ఇంకా దొరకలేదు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, నరేంద్ర మోడీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇంకా దొరకలేదని సమాచారం. ప్రస్తుతానికి వెంకయ్య నాయుడి అపాయింట్‌మెంట్ మాత్రమే లభించింది. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు మంగళవారం వెంకయ్య నాయుడును కలుస్తారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి షెడ్యూల్‌కు అనుగుణంగా వారికి అపాయింట్‌మెంట్ లభించే అవకాశం ఉంది. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం ఉద్దేశపూరకంగానే వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్సీలను కలుసుకోవడానికి ఆయన ఏ మాత్రం సుముఖంగా లేరని విశ్వసనీయ వర్గాల సమాచారం. రెండు రోజుల పాటు... టీడీపీ ఎమ్మెల్సీలో  ఢిల్లీలోనే ఉండనున్నారు. మరి ఈ సమయంలో వారికి ఎవరెవరి అపాయింట్ మెంట్ లభిస్తాయో చూడాల్సిందే.

ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్.. ప్రధాని మోదీతో పాటు... హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసిన విషయం తెలిసింది. వీరితో రాజధాని అంశంతో పాటు.. కర్నూలు హైకోర్టు తరలింపు వంటి కీలక విషయాలపై జగన్ చర్చలు జరిపినట్లు సమాచారం.

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు