ఆర్డినెన్స్ వార్తలపై యనమల ఆసక్తికర వ్యాఖ్యలు..

రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడంతో జగన్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: January 23, 2020, 10:16 AM IST
ఆర్డినెన్స్ వార్తలపై యనమల ఆసక్తికర వ్యాఖ్యలు..
యనమల రామకృష్ణుడు(File)
  • Share this:
రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడంతో జగన్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్డినెన్స్ తేవడం సాధ్యం కానేకాదని ఆయన అన్నారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపిన తర్వాత ఆర్డినెన్స్ ఇవ్వరాదని, అది సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. ‘మేము బిల్లును మండలికి చెందిన సెలక్ట్ కమిటీకి మాత్రమే అడిగాం. కమిటీలో మండలి సభ్యులు మాత్రమే ఉంటారు. మేము జాయింట్ సెలక్ట్ కమిటీని అడగలేదు. జాయింట్ కమిటీ అయితే.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు’ అని వివరించారు. తాను కూడా సెలక్ట్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశానని, కమిటీ ఏర్పాడ్డాక ప్రజాభిప్రాయం కూడా తీసుకోవచ్చని అని యనమల తెలిపారు.

ఇక.. సెలక్ట్ కమిటీ నిర్ణయానికి కనీస సమయం 3 నెలలని, నిర్ణయాన్ని 3 నెల్లలోపు తెలియజేయాలని కాదని ఆయన చెప్పారు. అంతకన్నా ఎక్కువ సమయం కూడా తీసుకునే అవకాశం సెలక్ట్ కమిటీకి ఉంటుందని యనమల స్పష్టం చేశారు. అటు.. ఏపీ శాసన మండలిని రద్దు చేస్తారని వస్తున్న వార్తలపై స్పందిస్తూ దానికి తాము భయపడబోమని అన్నారు.

First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు