జగన్ తొలి బడ్జెట్‌పై టీడీపీ సెటైరికల్ రియాక్షన్..

AP Budget High Lights | కొన్ని పథకాలకైనా కనీసం అల్లూరి సీతారామరాజు, కందుకూరి వీరేశలింగం, డా.బి.ఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల పేర్లు పెడితే బాగుండేదని సూచించారు.

news18-telugu
Updated: July 12, 2019, 4:34 PM IST
జగన్ తొలి బడ్జెట్‌పై టీడీపీ సెటైరికల్ రియాక్షన్..
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
news18-telugu
Updated: July 12, 2019, 4:34 PM IST
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సెటైర్లు వేశారు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఏపీ బడ్జెట్ ‘ప్రచారం ఎక్కువ, పస తక్కువ’ అంటూ ఎద్దేవా చేశారు. అప్పులు గురించి నీతులు చెప్పిన వైసీపీ ఇప్పుడు అప్పులు చేయడం లేదా అని ప్రశ్నించారు. అప్పులు గురించి వైసీపీ అడుక్కోవడం లేదా అని నిలదీశారు. సున్నా వడ్డీపై అసెంబ్లీలో నానా హంగామా చేసిన వైసీపీ నేతలు.. ఈ బడ్జెట్‌లో సున్నా వడ్డీ పథకానికి కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారని విరుచుకుపడ్డారు. సాంఘిక సంక్షేమానికి నిధులు తగ్గించారని, అలాగే ఇరిగేషన్ శాఖకు రూ.1000 కోట్లు నిధులు తగ్గించారని ఆరోపించారు. బడ్జెట్ లో ప్రకటించిన అన్ని పథకాలకు వైయస్ఆర్, జగన్ పేర్లు తప్ప వేరే పేర్లు లేవా అని నిలదీశారు. కొన్ని పథకాలకైనా కనీసం అల్లూరి సీతారామరాజు, కందుకూరి వీరేశలింగం, డా.బి.ఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల పేర్లు పెడితే బాగుండేదని సూచించారు. బడ్జెట్ లో నవరత్నాలు గురించి ప్రస్తావించిన జగన్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించకపోవడం విచారకరమన్నారు. జగన్ సర్కార్ కు దశ ఉంది కానీ దిశలేదని యనమల రామకృష్ణుడు అన్నారు.

First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...