వంశీతో టీడీపీకి కొత్త తలనొప్పి... పార్టీపై ఎమ్మెల్సీ అలక..

తనపై వంశీ చేసిన ఆరోపణలను పార్టీ పట్టించుకోలేదని... బోడె ప్రసాద్ దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉండేదని ఆయన అన్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: November 15, 2019, 5:32 PM IST
వంశీతో టీడీపీకి కొత్త తలనొప్పి... పార్టీపై ఎమ్మెల్సీ అలక..
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
ఓ టీవీ ఛానల్ చర్చలో టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరుష పదజాలంలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వంశీకి అదే రకంగా కౌంటర్ ఇచ్చేందుకు రాజేంద్రప్రసాద్ ప్రయత్నించారు. అయితే తాజాగా ఆయన టీడీపీ నాయకత్వంపై అలక వహించారని పార్టీలో చర్చ జరుగుతోంది. టీవీ చర్చ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ రాజేంద్రప్రసాద్‌కు డబ్బు ఇచ్చారని... కూతురు పెళ్లికి కూడా ఆయన డబ్బు తీసుకున్నానని వంశీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజేంద్రప్రసాద్ అలకకు కారణమైందని తెలుస్తోంది.

Vallabaneni vamsi, babu rajendra Prasad, tdp, ysrpc, ap news, ap politics, vamsi fire on rajendra Prasad, వల్లభనేని వంశీ, బాబూ రాజేంద్రప్రసాద్, టీడీపీ, వైసీపీ, ఏపీ న్యూస్
వల్లభనేని వంశీ,బాబు రాజేంద్రప్రసాద్


తనపై వంశీ చేసిన ఆరోపణలను పార్టీ పట్టించుకోలేదని... బోడె ప్రసాద్ దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉండేదని ఆయన అన్నట్టు తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వం దీనిపై కనీసం ఖండన కూడా ఇవ్వకపోవడం ఏమిటని ఆయన తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే ఈ అంశంపై ఆయనతో పార్టీ ముఖ్యనేతలు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారని... దీనిపై న్యాయపోరాటం చేసేందుకు పార్టీ సహకరిస్తుందని హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వల్లభనేని వంశీ వ్యవహారం కారణంగా టీడీపీకి మరో కొత్త తలనొప్పి వచ్చినట్టు కనిపిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: November 15, 2019, 5:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading