టీడీపీకి షాక్... ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా ?

టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేయనున్నారనే వార్తలు ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంచలనంగా మారింది.

news18-telugu
Updated: January 21, 2020, 12:04 PM IST
టీడీపీకి షాక్... ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా ?
డొక్కా మాణిక్యవరప్రసాద్(ఫైల్ ఫోటో)
  • Share this:
అసెంబ్లీలో ఆమోదం పొందిన మూడు రాజధానుల బిల్లు మండలిలో ఏ రకంగా ఆమోదం పొందుతుందనే ఆసక్తి అందరిలోనూ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేయనున్నారనే వార్తలు ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంచలనంగా మారింది. టీడీపీ ఎమ్మెల్సీలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించిన నేపథ్యంలోనే... టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేయనున్నారనే వార్తలు రావడం గమనార్హం. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. భవిష్యత్తుల్లో ఇక తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని... అమరావతి నుంచి రాజధాని తరలిపోతున్నందుకు బాధగా ఉందని ఆయన పేర్కొన్నారు. టీడీపీలో తనను ప్రొత్సహించినందుకు ఆయన చంద్రబాబుకు లేఖలో కృతజ్ఞతలు తెలిపారు.

వాస్తవానికి ఈ రోజు ఉదయం టీడీపీ ఎమ్మెల్సీలంతా మండలికి హాజరుకావాలని పార్టీ ఆదేశించినా.... డొక్కాతో పాటు శమంతకమణి, రత్నాబాయి సభకు రాలేదు. అనారోగ్య సమస్యల కారణంగానే శమంతకమణి సభకు రాలేకపోతున్నానని సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి డొక్కా తన పదవికి రాజీనామా చేయడం... టీడీపీలో అలజడి మొదలైంది. మరోవైపు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సైతం ఈ రోజు మండలికి రాలేదు.


First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు