అలా చేస్తే హీరోలు కాలేరు... మాజీమంత్రి వ్యాఖ్యలు

రాజకీయ నాయకులు పరుష పదజాలం వాడటం బాధాకరమని మాజీమంత్రి డొక్కా అన్నారు.

news18-telugu
Updated: November 18, 2019, 6:21 PM IST
అలా చేస్తే హీరోలు కాలేరు... మాజీమంత్రి వ్యాఖ్యలు
వల్లభనేని వంశీతో కొడాలి నాని(ఫైల్ ఫోటో)
  • Share this:
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఏపీ మంత్రి కొడాలి నాని తీరును టీడీపీ ఎమ్మెల్యే డొక్కా మాణిక్యవరప్రసాద్ పరోక్షంగా తప్పుబట్టారు. ఏపీ ప్రభుత్వం దూకుడు తగ్గించుకుని ప్రజలకు మేలు చేసేలా పాలన సాగించాలని ఆయన సూచించారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన డొక్కా... రాజకీయ నాయకులు పరుష పదజాలం వాడటం బాధాకరమని అన్నారు. దుర్భాషలాడడం ద్వారా ఎవరూ హీరోలు కారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు అందరినీ గమనిస్తున్నారని... కాబట్టి నాయకులంతా హుందాగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

కొంతమంది నాయకులు మీడియాను వేదికగా చేసుకుని పరుష పదజాలంతో మాట్లాడుతున్నారని డొక్కా అన్నారు. అలాంటి నాయకులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని అన్నారు.

First published: November 18, 2019, 6:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading