అచ్చోసిన ఆంబోతులా తిరుగుతున్నదెవరో..: జీవీఎల్‌కు బుద్దా కౌంటర్

సీఎంపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని జీవిఎల్‌ను హెచ్చరించారు. సీఎం చంద్రబాబు మోదీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు కాబట్టే.. జీవిఎల్ ఆయనపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు.

news18-telugu
Updated: November 11, 2018, 3:15 PM IST
అచ్చోసిన ఆంబోతులా తిరుగుతున్నదెవరో..: జీవీఎల్‌కు బుద్దా కౌంటర్
జీవిఎల్ నరసింహారావు, బుద్దా వెంకన్న(File)
  • Share this:
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావుకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు దేశ దిమ్మరిలా తిరుగుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలను ఖండించారు. కోటి రూపాయల సూట్, రూ.4 లక్షల విలువ చేసే బూట్లు వేసుకుని దేశమంతా అచ్చోసిన ఆంబోతులా తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదెవరో ప్రజలకు తెలుసన్నారు.

సీఎంపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని జీవిఎల్‌ను హెచ్చరించారు. సీఎం చంద్రబాబు మోదీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు కాబట్టే.. జీవిఎల్ ఆయనపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే చంద్రబాబు దేశంలోని అన్ని పార్టీలను ఏక తాటి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రాజధానికి కేంద్రం రూపాయి సహాయం చేయకపోయినా.. తిత్లీ తుఫాన్‌ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రాకపోయినా.. చంద్రబాబు రాష్ట్రాన్ని గాడినపెట్టారని తెలిపారు.

వైఎస్ విజయమ్మ వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న..

జగన్ ఇకనైనా కోడి కత్తి డ్రామాలు ఆపాల్సిందిగా వైఎస్ విజయమ్మ తన తనయుడికి సూచించాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సూచించారు. ఏదైనా ఉంటే రాజకీయంగానే తేల్చుకోవాలని జగన్‌కు సలహా ఇవ్వాల్సిందిగా విజయమ్మకు విజ్ఞప్తి చేశారు. లేదంటే ప్రజలు జగన్‌ను ఛీకొడుతారని విమర్శించారు. జగన్ పాదయాత్రకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తోందని, ఇకముందు కూడా అది కొనసాగుతుందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న జడ్‌ప్లస్ కేటగిరిని చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని, రాష్ట్ర పోలీసులపై ఆయనకు నమ్మకం లేదా? అన్న విజయమ్మ ప్రశ్నలపై వెంకన్న స్పందించారు. నక్సలైట్లు ఆయనపై దాడి జరిపితే.. కేంద్రమే ఆయనకు జడ్‌ప్లస్ కేటగిరి భద్రత కల్పించిందన్నారు. ఆయనేమి కావాలని తనకు జడ్‌ప్లస్ కేటగిరి భద్రత కావాలని కేంద్రాన్ని కోరలేదన్నారు. అయినా దేశంలో చాలామందికి జడ్‌ప్లస్ కేటగిరి భద్రత కల్పించారని, దానిపై విజయమ్మ వ్యాఖ్యలు సరికాదని అన్నారు. నక్సలైట్లు బాంబులు పేల్చినా.. హీరోలా చంద్రబాబు ఆ దాడి నుంచి బయటపడ్డారని, ఆయన మృత్యుంజయుడు అని ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి:

దేశ దిమ్మరిలా తిరుగుతూ.. ప్రజాధనాన్ని బాబు లూటీ చేస్తున్నారు: జీవిఎల్

జగన్‌కు ఇదో పునర్జన్మ.. జనం నుంచి ఆయన్ను వేరు చేయలేరు: విజయమ్మ
Published by: Srinivas Mittapalli
First published: November 11, 2018, 3:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading