ట్విట్టర్‌లో కాదు రైతుల మధ్యకు వచ్చి మాట్లాడు.. విజయసాయి రెడ్డికి టీడీపీ సవాల్..

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే టీడీపీ నేతలకు అమరావతి అంటే ప్రేమ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. తీవ్ర స్థాయిలో పదజాలం వాడుతూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 10, 2019, 1:44 PM IST
ట్విట్టర్‌లో కాదు రైతుల మధ్యకు వచ్చి మాట్లాడు.. విజయసాయి రెడ్డికి టీడీపీ సవాల్..
విజయసాయిరెడ్డి, బుద్ధా వెంకన్న (File)
  • Share this:
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే టీడీపీ నేతలకు అమరావతి అంటే ప్రేమ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. తీవ్ర స్థాయిలో పదజాలం వాడుతూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు లేని సాయి రెడ్డి గారు అమరావతిలో రూ. లక్షల కోట్ల అవినీతి జరిగిందా? అవినీతి జరిగితే మరి మూడు నెలల నుండి ఏం గడ్డి పీకుతున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. నోరు ఉంది కదా అని అడ్డమైన ఆరోపణలు చేయొద్దని, అధికారంలోకి ఉన్నది వైసీపీయేనన్న అన్న విషయం మర్చిపోవద్దని హితవు పలికారు.‘నీ దొంగ పేపర్‌లో రాసే వార్తలు అక్షర సత్యాలా? వరల్డ్ బ్యాంక్ వెళ్లిపోవడానికి మీ కుట్రే కారణం అని పత్రికలు బయటపెడితే అవి పచ్చ పత్రికలు అని మీడియాని అవమనపరుస్తారా?’ అని ధ్వజమెత్తారు.

ఇక, రాజధాని గురించి ట్విట్టర్‌లో ట్వీట్లు చేయడం మాని, దమ్ముంటే అక్కడకి వచ్చి రైతుల ముందు మీ పార్టీ వైఖరి స్పష్టం చేయాలి..420 తాతయ్యా అంటూ సవాల్ విసిరారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: September 10, 2019, 1:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading