Andhra Pradesh: వైసీపీ గెలిస్తే టీడీపీనీ మూసేస్తాం.. సవాల్ కు వైసీపీ సై అంటుందా?

Andhra Pradesh: వైసీపీ గెలిస్తే టీడీపీనీ మూసేస్తాం.. సవాల్ కు వైసీపీ సై అంటుందా?

ప్రతీకాత్మక చిత్రం

ఢీ అంటే ఢీ అంటున్నారు వైసీపీ-టీడీపీ నేతలు. రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లు కొససాగుతున్నాయి. టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఓ అడుగు ముందుకేసి.. వైసీపీ గెలిస్తే టీడీపీనే మూసేస్తాం ఆ ఛాలెంజ్ కు అధికార పార్టీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

  • Share this:
    మున్సిపల్ ఎన్నికల వేళ అధికార వైసీపీ -ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును ఆపేయడంతో ఏపీలో ప్రస్తుతం రాజకీయ యుద్ధవాతావరణం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉండే హంగామా కనిపిస్తోంది. ఇరు వర్గాలు రాజకీయ విమర్శలకే పరిమితం అవ్వడం లేదు..  కొన్ని జిల్లాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది.

    రెండు రాజకీయ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వైసీపీకి సవాల్ విసిరారు. రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అడ్డుకోవడం సీఎం జగన్ పిరికిపంద చర్య అని మండిపడ్డారు. చంద్రబాబే తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారన్న భయం జగన్‌లో మొదలైందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ జగన్‌కు నిజంగా ప్రజాబలముంటే తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. అలా ఎన్నికలకు వెళ్లి.. ఆ ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఆదరిస్తే, టీడీపీని మూసేస్తామని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. ప్రజాబలంతో టీడీపీ విజయం సాధిస్తే, వైసీపీ దుకాణం కట్టేయడానికి జగన్ సిద్ధమేనా? అంటూ ఛాలెంజ్ చేశారు.

    అయితే బుద్ధా వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఘాటుగానే కౌంటర్ ఇస్తున్నారు. అంతెందుకు టీడీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేసి.. ముందు ఒక్క సీటైనా గెలవమనండి అంటున్నారు.. లేదంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క నగరంలోనైనా గెలిచి చూపించమనండి అంటూ తిరిగి కౌంటర్లు వేస్తున్నారు..

    మరోవైపు ఓటమి భయంతోనే టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు అంతే లేకుండా పోతోందని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ బెదిరింపులకు భయపడవద్దని నామినేషన్ వేసిన అభ్యర్థులకు పార్టీ తరపున భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతిలోనే మకాం వేసిన రాష్ట్రస్థాయి నేతలు పార్టీ అభ్యర్థులు విత్ డ్రా అవ్వకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. 6 వార్డులకు నామినేషన్ దాఖలు చేయడానికి టీడీపీ అభ్యర్థులతో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్దకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో కలసి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాబి కూడా వెళ్లారు.

    చిత్తూరు ప్రజల నుంచి టీడీపీకి మద్దతు లభిస్తుండడంతో జిల్లా మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి., తిరుపతి ఎమ్మెల్యే భూమనలు అరాచకాలకు తెరలేపారని పట్టాభి ఆరోపించారు. టీడీపీ తరుపున నామినేషన్ వేసిన వారిని ప్రలోభాలకు గురి చేసి.. అందుకు ఒప్పుకోకపోతే ఆస్తులపై దాడికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడకుండా పార్టీ వైపు ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు చిత్తూరు పర్యటనకు వస్తే ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత ఎక్కడ బయటపడుతుందో అనే అనుమానంతోనే.. అలా ఎయిర్ పోర్టులోనే పర్యటనను అడ్డుకున్నారని పట్టాభి ఆరోపించారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు