420 తాతయ్య మూలుగుతా ఉంటాడు... టీడీపీ నేత ఘాటు వ్యాఖ్యలు

‘పందికి ఏం తెలుస్తుంది పాండ్స్ వాసన @VSReddy_MP 420 తాతయ్యా? దొంగలెక్కలు రాసేవాడికి ఏం తెలుస్తుంది కార్యకర్తలు, నాయకుల విలువ అంటూ ఆయనపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: August 31, 2019, 3:33 PM IST
420 తాతయ్య మూలుగుతా ఉంటాడు... టీడీపీ నేత ఘాటు వ్యాఖ్యలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి వేసిన ట్విట్టర్ పోస్టులకు కౌంటరిచ్చారు. విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ...‘ నెత్తిన తాటికాయ పడిన గుంటనక్కలాగా @VSReddy_MP
420 తాతయ్య ట్విట్టర్ లో ఓ మూలుగుతా ఉంటారు. అయ్యా! పత్తిత్తు కబుర్లు అంటారు. మిమ్మల్ని చూసినా, మీ మాటలు విన్నా పత్తిత్తే గుర్తుకువస్తోంది. రాజకీయ హింసలో పి హెచ్ డి చేసినోళ్ళ వైపు నిలబడి నీతులు మాట్లాడితే ఎలా?’ అంటూ ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేశారు.

‘పందికి ఏం తెలుస్తుంది పాండ్స్ వాసన @VSReddy_MP 420 తాతయ్యా? దొంగలెక్కలు రాసేవాడికి ఏం తెలుస్తుంది కార్యకర్తలు, నాయకుల విలువ. పార్టీకి ప్రాణమిచ్చే వారిని కుక్కలతో పోల్చి సంబరపడుతున్నావు. నీలాంటి అవినీతి పందులకు జైలుపూజ చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. త్వరలో నీకు చిప్పకూడు ఖాయం’ అంటూ మరో ట్వీట్ చేశారు బుద్ధా. ‘420 తాతయ్యా @VSReddy_MP
గారూ! కులాన్ని మతాన్ని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చెయ్యడం మీకే చెల్లింది. అసలు టీటీడీలో అన్యమతస్థులను జొప్పించిందే మీ మహామేత. కావాలంటే వెళ్లి జీవోలు చూసుకో. ఇప్పుడొచ్చి పరమానందయ్య శిష్యుడిలా సొల్లు చెప్పకు’ అంటూ కాస్త ఘాటు పెంచారు వెంకన్న. విజయసాయిరెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డారు.

గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు పోస్టుల పెడుతూ... ఏపీ రాజకీయాల్ని వేడెక్కిస్తున్నారు. తాజాగా మసీపీఎంపీ రోసారి వైవిజయసాయిరెడ్డి వేసిన ట్విట్టర్ పోస్టులకు... టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇచ్చిన ఘాటైన సమాధానం కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సాయిరెడ్డి టీడీపీ నేతల్ని కుక్కలతో పోల్చడంతో.... బుద్ధా వెంకన్న ఆయనను పందితో పోల్చుతూ విమర్శల పదును పెంచారు.
Published by: Sulthana Begum Shaik
First published: August 31, 2019, 3:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading