TDP MLC BTECH RAVI CONTROVERSIAL COMMENTS ON CM JAGAN OVER NOT SOLVING YS VIVEKANANDA REDDY MURDER CASE HSN
CM Jagan- Btech Ravi: ఆ కేసును ఇప్పటికీ తేల్చలేకపోయారు.. జగన్ గారూ.. ముందు దాన్ని తేల్చండంటూ టీడీపీ ఎమ్మెల్సీ ఆగ్రహం
సీఎం జగన్, ఎమ్మెల్సీ బీటెక్ రవి (ఫైల్ ఫొటోలు)
’ఈ కేసు ఎస్సీ ఎస్టీ కేసు కాదనీ, అల్లర్ల కేసు అని పోలీసులు చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివిన అధికారులు కూడా అబద్దాలు ఆడటం బాధాకరం. రాష్ట్రంలోని టీడీపీ నేతలపై ఎస్సీ ఏస్టీ కేసులు నమోదు చేయించిన ఏకైక వ్యక్తి జగన్. టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని రాజారెడ్డి రాజ్యాంగంలో ఏమైనా ఉందా. టీడీపీ నేతల అణిచివేతకై కెటాయించే సమయాన్ని రైతులపై దృష్టి పెట్టాలి.‘ అని బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప: ఎన్ని కేసులు పెట్టినా తాను భయపడననీ, కేసులు తనకు కొత్తేమీ కాదని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి స్పష్టం చేశారు. అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారనీ, వచ్చే ఎన్నికల వరకు కూడా తనను జైల్లో ఉంచినా భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం కేంద్ర కారాగారం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ కేసు విషయమై కొద్ది రోజుల క్రితం ఆయన్ను చెన్నై విమానాశ్రయంలో ఉండగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులను అరెస్ట్ చేసినంత సీన్ ను క్రియేట్ చేసి తనను అదుపులోకి తీసుకున్నారనీ, అన్నం, నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారనీ అరెస్ట్ సమయంలో బీటెక్ రవి ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఆయన్ను కడప సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. తాజాగా వైసీపీ సర్కారుపై బీటెక్ రవి విమర్శలు గుప్పించారు.
’కేసులు మాకేమీ కొత్త కాదు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోనేందుకు సిద్దమే. చెన్నై ఎయిర్ పోర్టులో ఎస్సీ ఎస్టీ కేసులో అరెస్ట్ చేశామని మొదట్లో పోలీసులు చెప్పారు. అ తర్వాత మాట మార్చేశారు. ఈ కేసు ఎస్సీ ఎస్టీ కేసు కాదనీ, అల్లర్ల కేసు అని పోలీసులు చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివిన అధికారులు కూడా అబద్దాలు ఆడటం బాధాకరం. రాష్ట్రంలోని టీడీపీ నేతలపై ఎస్సీ ఏస్టీ కేసులు నమోదు చేయించిన ఏకైక వ్యక్తి జగన్. టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలని రాజారెడ్డి రాజ్యాంగంలో ఏమైనా ఉందా. టీడీపీ నేతల అణిచివేతకై కెటాయించే సమయాన్ని రైతులపై దృష్టి పెట్టాలి.‘ అని బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో పెట్టి తన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారనీ, అదేమి జరగబోదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కలకలం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ఈ సందర్భంగా బీటెక్ రవి ప్రస్తావించారు. ఆ కేసు విచారణలో జరగుతున్న జాప్యాన్ని, కేసు ఇంతవరకు పరిష్కారం కాకపోవడం గురించి రియాక్టయ్యారు. ‘మీ చిన్నాన వివేకా హత్య కేసును ఇప్పటికీ తేల్చలేకపోయారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. సొంత కుటుంబంలోని వ్యక్తి హత్యకు గురయితేనే ఇంత వరకు తేల్చలేదు. టీడీపీని ఎలా ఇబ్బందులు పెట్టాలన్న దానిపైనే జగన్ శ్రద్ధ పెడుతున్నట్టు కనిపిస్తోంది. కాస్త మీ చిన్నాన్న హత్య కేసుపై కూడా దృష్టి సారించండి జగన్ గారూ..‘ అంటూ బీటెక్ రవి విమర్శలు గుప్పించారు.
Published by:Hasaan Kandula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.