మూడు రాజధానులకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్సీ రాజీనామా...

మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదానికి నిరసనగా ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని బీటెక్ రవి ముందుకొచ్చారు.

news18-telugu
Updated: July 31, 2020, 7:41 PM IST
మూడు రాజధానులకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్సీ రాజీనామా...
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. దీనిపై ప్రతిపక్ష టీడీపీ నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదానికి నిరసనగా ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు బీటెక్ రవి లేఖ రాశారు. బీటెక్ రవి పులివెందులకు చెందిన టీడీపీ నేత. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులపై గవర్నర్ సంతకం చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీటెక్ రవి అభిప్రాయపడ్డారు. శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం రాజ్యంగ విరుద్ధమన్నారు. చట్ట సభ అయిన శాసనమండలికి దక్కిన ప్రాధాన్యానికి కలత చెందిన తాను అలాంటి ప్రాధాన్యత లేని సభలో ఉండడం అనవసరంగా భావించి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు చంద్రబాబునాయుడుకు ఆయన లేఖ రాశారు.

చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపిన బీటెక్ రవి


తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్‌కు సంబంధిత ఫార్మాట్‌లో పంపుతానని, పదవిలో లేకపోయినా పార్టీలో మాత్రం క్రియాశీలకంగా పనిచేస్తానని చెప్పారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 31, 2020, 7:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading