Home /News /politics /

TDP MLA VALLABHANENI VAMSI MEETS AP CM YS JAGAN AFTER MEETING BJP MP SUJANA CHOWDARY BA

సీఎం జగన్‌తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ.. వైసీపీలోకి జంప్?

వల్లభనేని వంశీ మోహన్(File)

వల్లభనేని వంశీ మోహన్(File)

ఉదయం బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయిన వల్లభనేని వంశీ.. కొన్ని గంటల్లోనే సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

    ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సమావేశం అయ్యారు. జగన్‌తో ఆయన సుమారు అరగంట పాటు చర్చించినట్టు తెలిసింది. జగన్‌తో వంశీ భేటీ సందర్భంగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని కూడా పక్కనే ఉన్నారు. గత కొన్ని రోజులుగా వల్లభనేని వంశీ టీడీపీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. నిన్న తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. భవన నిర్మాణకార్మికులకు మద్దతుగా టీడీపీ జరుపుతున్న ఆందోళనలకు కూడా వల్లభనేని వంశీ హాజరుకాలేదు.

    వల్లభనేని వంశీ టీడీపీని వీడతారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో సమావేశమైన వల్లభనేని వంశీ.. అది జరిగిన కొన్ని గంటల్లోనే ఏపీ ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వంశీ వైసీపీలో చేరబోతున్నారా? బీజేపీలో చేరబోతున్నారా? బీజేపీలో చేరాలనుకుంటే... జగన్‌తో సమావేశం కావడం ఎందుకనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది.

    కొన్ని రోజుల క్రితం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద పోలీస్ కేసు నమోదైంది. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద బాపులపాడు తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వల్లభనేని వంశీ... వేల సంఖ్యలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారంటూ హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన స్థానంలో పనిచేసిన తహసీల్దార్ సంతకాన్ని వల్లభనేని వంశీ సంతకాన్ని ఫోర్జరీ చేశారని.. పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారంటూ కొత్త తహసీల్దార్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెరికీడు, కొయ్యూరు, కోడూరుపాడు, బాపులపాడు సహా పలు గ్రామాల్లో నకిలీ ఇళ్లపట్టాలను పంపిణీ చేశారని తహసీల్దార్ ఆరోపించారు. దీంతో పోలీసులు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతోపాటు ఆయన అనుచరుడు రంగాపై కేసు నమోదు చేశారు.

    జగన్‌తో వల్లభనేని వంశీ..తోడుగా ఇద్దరు నానిలు..

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap bjp, AP Politics, Tdp, Vallabaneni Vamsi, Vallabhaneni vamsi

    తదుపరి వార్తలు