Home /News /politics /

TDP MLA VALLABHANENI VAMSI LIKELY TO JOIN YSRCP ON 3RD NOVEMBER BA

వైసీపీలోకే వల్లభనేని వంశీ.. ముహూర్తం ఫిక్స్...

వల్లభనేని వంశీ మోహన్(File)

వల్లభనేని వంశీ మోహన్(File)

Vallabhaneni Vamsi | నవంబర్ 3వ తేదీన వల్లభనేని వంశీ వైసీపీ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

    టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు ఆయన ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. నవంబర్ 3వ తేదీన ఆయన వైసీపీ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. నిన్న ఎమ్మెల్యే పదవి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించారు. వైసీపీ నేతలు, కొందరు అధికారుల తీరు వల్ల కేడర్‌ ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుట్ర రాజకీయాలతో తాను, తన అనచరులు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయామని.. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.

    అనంతరం చంద్రబాబు, వల్లభనేని వంశీ మధ్య వాట్సాప్ చాటింగ్ కూడా కొనసాగింది. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలపై జరిపే పోరాటానికి టీడీపీ, తాను వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటానంటూ చంద్రబాబునాయుడు వంశీకి భరోసా ఇచ్చారు. దీంతోపాటు వంశీతో చర్చలు జరపడానికి కేశినేని నాని, కొనకళ్ల నారాయణలకు బాధ్యతలు అప్పగించారు.

    రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేయడానికి రెండు రోజుల ముందు వల్లభనేని వంశీ అటు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అయితే, వంశీ నేరుగా వైసీపీలో చేరకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

    అయ్యయ్యో.. టపాసులు కాలుస్తుంటే.. కారు ఢీకొట్టేసింది...

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, Tdp, Vallabaneni Vamsi, Vallabhaneni Vamshi, Vallabhaneni vamsi, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు