విజయవాడ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే (గన్నవరం) వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించారు. వైసీపీ నేతలు, కొందరు అధికారుల తీరు వల్ల కేడర్ ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుట్ర రాజకీయాలతో తాను, తన అనచరులు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయామని.. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లో చంద్రబాబు తనకు మంచి అవకాశాలు కల్పించారని.. ఆయనకు ధన్యవాదాలని లేఖలో పేర్కొన్నారు వంశీ.
వంశీ పార్టీ మారతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీలోకి వెళ్తారని కొందరు.. బీజేపీలోకి వెళ్తారని ఇంకొందరు ..ప్రచారం చేయడంతో విజయవాడ రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సీఎం వైఎస్ జగన్‌ను కలవడం, అంతకుముందు బీజేపీ సుజనా చౌదరిని కలవడం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఐతే వైసీపీలో వంశీ చేరకుండా గన్నవరం స్థానిక నేత యార్లగడ్డ వెంకటరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన వస్తే వైసీపీకి తీవ్ర నష్టం తప్పదని అభిప్రాయపడ్డారు. వంశీ వైసీపీలో చేరబోరని.. కేసుల భయంతోనే జగన్‌ను కలిశారని విమర్శించారు యార్లగడ్డ. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
వల్లభనేని వంశీ రాజీనామా లేఖ
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.