హోమ్ /వార్తలు /National రాజకీయం /

మా అక్కను అంటే మెడలు విరిచేస్తా -భువనేశ్వరిపై వైసీపీ కామెంట్లకు నందమూరి బాలకృష్ణ రియాక్షన్ - ఏమన్నారంటే..

మా అక్కను అంటే మెడలు విరిచేస్తా -భువనేశ్వరిపై వైసీపీ కామెంట్లకు నందమూరి బాలకృష్ణ రియాక్షన్ - ఏమన్నారంటే..

బాలయ్య, భువనేశ్వరి (ఫైల్)

బాలయ్య, భువనేశ్వరి (ఫైల్)

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అధికార వైసీపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమె సోదరుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. జోలికొస్తే మెడలు విరిచేస్తానంటూ వైసీపీకి బాలయ్య వార్నింగ్ ఇచ్చారు..

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari)ని ఉద్దేశించి అధికార వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నందమూరి కుటుంబం భగ్గుమంది. భువనేశ్వరి సోదరుడు, వియ్యంకుడు కూడా అయిన హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ వివాదంపై తొలిసారి స్పందించారు. మా అక్క జోలికి ఇంకోసారి వస్తే మెడలు విరిచేస్తానంటూ వైసీపీకి బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. నందమూరి కుటుంబానికి చెందిన ఇతర సభ్యులతో బాలయ్య శనివారం తన ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో పరిణామాలు, అధికార వైసీపీ పోకడలపై బాలయ్య స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు..

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాడు వ్యవసాయ రంగంపై చర్చ సందర్బంగా టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం, వివేకా హత్యను సీఎం జగన్ కు ఆపాదిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయగా, దివంగత మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి మృతిని ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో ఓ వైసీపీ ఎమ్మెల్యే.. నారా లోకేశ్ పుట్టుకపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది విన్న చంద్రబాబు.. పట్టలేని ఆక్రోషంతో వైసీపీపై ఆగ్రహం వెళ్లగక్కుతూ సభ నుంచి బయటికొచ్చేశారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ లోనూ చంద్రబాబు కన్నీరుమున్నీరుగా విలపిపిస్తూ.. తన భార్యపై వైసీపీ నేతలు దిగజారుడు కామెంట్లు చేశారని, స్పీకర్ సైతం ఉదాసీనంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ ఘటనపై..

నారా భువనేశ్వరిపై దారుణ కామెంట్లు.. స్పీకర్ తమ్మినేని చర్యలు -చంద్రబాబుకు కౌంటర్ -లోకేశ్ పుట్టుకపై..!!


చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో తమ తప్పేది లేదని అధికార వైసీపీ నేతలు వాదిస్తుండగా, నందమూరి కుటుంబం మాత్రం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. బాలయ్య నేతృత్వంలో కుటుంబీకులు శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు.


చంద్రబాబు భార్యను అంత మాట అంటారా? -ఎన్టీఆర్ కుటుంబీకులు ఫైర్ -నారా భువనేశ్వరికి బీజేపీ నేత పురందేశ్వరి సహా..


అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదిక అయిందని, ఎంతో ధైర్యంగా పోరాడే చంద్రబాబు.. కన్నీరు పెట్టడం ఏనాడూ చూడలేదని నందమూరి బాలకృష్ణ అన్నారు. అసెంబ్లీలో వ్యక్తులు, వ్యక్తిత్వాలను కించపరిచేలా అధికార వైసీపీ నేతలు ప్రవర్తించారని, వ్యక్తిత్వ హననానికి పాలుపడ్డారని ఆయన మండిపడ్డారు. ‘ఇకపై నోరు జారితే ఎవరినీ ఉపేక్షించం. ఇక్కడ ఎవరూ చేతులుక ట్టుకుని కూర్చోలేదు. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం. ఇంకోసారి ఇలా మాట్లాడితే.. ఖబర్దార్.. నోరు అదుపులో పెట్టుకోండి.. ’అంటూ బాలయ్య.. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు..

First published:

Tags: Balayya, Nandamuri balakrishna, Nara Bhuvaneshwari

ఉత్తమ కథలు