టీడీపీకి మరో షాక్... వైసీపీలోకి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే

2009లో టీడీపీ తరపున నరసరావుపేట ఎంపీగా విజయం సాధించిన మోదుగుల... 2014లో టీడీపీ తరపున గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే చాలాకాలంగా తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదనే భావనతో ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి... తన అసంతృప్తిని పలుసార్లు బహిరంగంగానే వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: March 5, 2019, 5:57 PM IST
టీడీపీకి మరో షాక్... వైసీపీలోకి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే
చంద్రబాబు, జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
కొంతకాలం నుంచి టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఆ పార్టీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి... ఎట్టకేలకు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. త్వరలో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి అధికారికంగా వైసీపీ గూటికి చేరబోతున్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2009లో టీడీపీ తరపున నరసరావుపేట ఎంపీగా విజయం సాధించిన మోదుగుల... 2014లో టీడీపీ తరపున గుంటూరు  పశ్చిమ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే చాలాకాలంగా తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదనే భావనతో ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి... తన అసంతృప్తిని పలుసార్లు బహిరంగంగానే వ్యక్తం చేశారు.

కొద్దిరోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్న మోదుగుల... నల్లచొక్కాలతో టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసిన సమయంలోనూ తెల్ల చొక్కాతోనే అసెంబ్లీకి వచ్చి పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీని వీడటం ఖాయమనే భావనలో పార్టీ నేతలు... గుంటూరు  పశ్చిమ నియోజకవర్గానికి ఆయన పేరును పరిశీలనలో తీసుకోవడం లేదని చర్చించుకుంటున్నారు. మరోవైపు వైసీపీలో చేరబోయే మోదుగుల ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే అంశం కూడా ఆసక్తికరంగా మారంది. ఆయన గుంటూరు లేదా నరసరావుపేట ఎంపీ స్థానాలకు పోటీ చేసే అవకాశం ఉందని కొందరంటుంటే... ఈ సారి మోదుగుల సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

First published: March 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...