టీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యే ప్లాన్‌లో టీడీపీ ఎమ్మెల్యే?

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నమోదు చేసిన విజయాన్ని చూసిన తర్వాత కారు పార్టీతో కలసి నడవాలని ఖమ్మం జిల్లా అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు భావిస్తున్నట్టు తెలిసింది.

news18-telugu
Updated: January 25, 2020, 10:38 PM IST
టీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యే ప్లాన్‌లో టీడీపీ ఎమ్మెల్యే?
టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు
  • Share this:
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వన్ సైడ్ విక్టరీ నమోదు చేసింది. 9 కార్పొరేషన్లలో ఆరు చోట్ల కారు పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. రెండుచోట్ల టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. 120 మున్సిపాలిటీలకు గాను 103 చోట్ల కారు పార్టీ జోరు కంటిన్యూ అయింది. 8 చోట్ల కాంగ్రెస్ గెలుపొందింది. బీజేపీ 3, ఎంఐఎం 2 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి.

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నమోదు చేసిన విజయాన్ని చూసిన తర్వాత కారు పార్టీతో కలసి నడవాలని ఖమ్మం జిల్లా అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు భావిస్తున్నట్టు తెలిసింది. గతంలోనే మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మచ్చా నాగేశ్వరరావు ఇద్దరూ సైకిల్ దిగి కారెక్కుతారని ప్రచారం జరిగింది. అయితే, కొన్నాళ్ల తర్వాత సండ్ర గులాబీ గూటికి చేరారు. మచ్చా నాగేశ్వరరావు మాత్రం టీడీపీలోనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీని అంటిపెట్టుకుని ఉండడం వల్ల ఉపయోగం లేదని భావించిన మచ్చా నాగేశ్వరరావు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం చూసిన తర్వాత తాను కూడా గులాబీ కండువా కప్పుకొనే యోచనలో ఉన్నట్టు సమాచారం.

2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ తరఫున కేవలం పువ్వాడ అజయ్ మాత్రమే గెలుపొందారు. ఇద్దరు టీడీపీ సభ్యులు విజయం సాధించారు. ఆ ఇద్దరిలో ఒకరు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. కానీ, మచ్చా నాగేశ్వరరావు మాత్రం తెలంగాణ టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి అప్పగిస్తారనే భావనలో ఉన్నారు. తాను చంద్రబాబుతో మాట్లాడానని, జూనియర్ ఎన్టీఆర్‌కు తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పగిస్తారని చెప్పారు . ఈ విషయంపై అప్పట్లో భారీగా చర్చ జరిగింది. కానీ, ఆ తర్వాత అలాంటి ప్రతిపాదన ఏదీ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం నుంచి రాలేదు.

First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు