అందుకే సీఎం జగన్‌ను కలుస్తున్నా...క్లారిటీ ఇచ్చిన కరణం

తాను టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ ఎమ్మెల్యే కరణం బలగాం క్లారిటీ ఇచ్చాశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం జగన్‌ను కలవనున్నట్లు చెప్పారు.

news18-telugu
Updated: March 12, 2020, 12:49 PM IST
అందుకే సీఎం జగన్‌ను కలుస్తున్నా...క్లారిటీ ఇచ్చిన కరణం
కరణం బలరాం(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో తెలుగుదేశం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బతగిలింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం అధికార వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కరణం బలరాంతో పాటు ఆయన తనయుడు వెంకటేశ్ కూడా వైసీపీ తీర్థంపుచ్చుకోనున్నారు.  ఈ మధ్యాహ్నం సీఎం జగన్‌ను కలుస్తున్నట్లు స్వయంగా కరణం బలరాం మీడియాకు కన్ఫర్మ్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. వైసీపీ అనుకూల పవనాలు వీచినా నియోజకవర్గ ప్రజలు తనను 20 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారన్నారు. స్థానిక పరిస్థితుల మేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం జగన్ దగ్గరకు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. సీఎం జగన్‌ను కలిసేందుకు చీరాల నుంచి తాడేపల్లికి ఆయన బయలుదేరారు. మధ్యాహ్నం 3 గం.లకు కరణం బలరాం సీఎం జగన్‌ను కలవనున్నారు. కరణం వెంట ఆయన సన్నిహితులు, మద్దతుదారులు కూడా ఉన్నారు. గత రెండు రోజులుగా నియోజకవర్గంలోని తన సన్నిహితులు, మద్దతుదారులతో సమాలోచనల తర్వాత  వైసీపీ గూటికి చేరాలని కరణం బలరాం నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఇప్పటికే వైసీపీ తీర్థంపుచ్చుకున్నారు. ఇప్పుడు కరణం బలరాం కూడా వైసీపీ గూటికి చేరనుండటం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కరణం బలరాంను వైసీపీ గూటికి తీసుకురావడంతో జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీని డిఫెన్స్‌లోకి నెట్టేందుకు ముందుగానే కరణం బలరాంను వైసీపీ గూటికి చేరేలా బాలినేని ఒప్పించారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి ఆ పార్టీని వీడి వైసీపీ సానుభూతిపరుగా వ్యవహిస్తున్నారు. వీరి బాటలోనే ఇప్పుడు కరణం బలరాంను కూడా అధికారికంగా వైసీపీలో చేర్చుకోకుండా...పార్టీ సానుభూతిపరుడిగా కొనసాగించాలన్న యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
First published: March 12, 2020, 12:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading