• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TDP MLA GOTTIPATI RAVIKUMAR LIKELY TO BE JOIN IN YCP NS GNT

TDPకి త్వరలో మరో షాక్.. జగన్ కు జై కొట్టనున్న మరో ఎమ్మెల్యే?

TDPకి త్వరలో మరో షాక్.. జగన్ కు జై కొట్టనున్న మరో ఎమ్మెల్యే?

ప్రతీకాత్మక చిత్రం

పుట్టెడు కష్టాల్లో ఉన్న టీడీపీకి త్వరలో మరో షాక్ తగిలే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. అద్దంకి నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన గొట్టిపాటి రవి కుమార్ వైసీపీ గూటికి చేరనున్నారన్న ప్రచారం ప్రకాశం జిల్లాలో జోరుగా సాగుతోంది.

  • Share this:
    ఎన్నికల్లో ఓటమి, అనంతరం కొందరు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు తెలపడంతో పుట్టెడు కష్టాల్లో ఉన్న టీడీపీకి త్వరలో మరో షాక్ తగిలే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. అద్దంకి నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన గొట్టిపాటి రవి కుమార్ వైసీపీ గూటికి చేరనున్నారన్న ప్రచారం ప్రకాశం జిల్లాలో జోరుగా సాగుతోంది. గొట్టిపాటికి చిరకాల ప్రత్యర్థి అయిన కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు వైసీపీ అద్దంకి నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం ఇటీవల జోరుగా సాగుతోంది. ఇటీవల చీరాలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్, ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాం వర్గీయుల మధ్య రాళ్లదాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరిని శాంతిప చేయడానికి అధిష్టానం కరణం బలరాం కుమారుడు వెంకటేష్ ను అద్దంకి పంపనుందన్న చర్చ సాగుతోంది. అయితే వెంకటేష్ వస్తే తన కార్యకర్తలకు, తనకు ఇబ్బందుల తప్పదని గొట్టిపాటి కలవరపడుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే తన వ్యాపారాలకు సైతం ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఈ విషయంపై ఇప్పటికే ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లా మంత్రి బాలినేనితో పలు దఫాలుగా చర్చలు జరిపారని తెలుస్తోంది. ఇద్దరి మధ్య గతంలో వైసీపీలో పనిచేసినప్పటి నుంచి మంచి ఫ్రెండ్ షిప్ ఉందని.. దీంతో గతంలో బాలినేనిని అనేక విధాలుగా గొట్టిపాటి రవికుమార్ ఆదుకున్నారని జిల్లాలో ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి బాలినేని ద్వారా గొట్టిపాటి మళ్లీ వైసీపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారని తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా గొట్టిపాటిని తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే గొట్టిపాటిని సరైన సమయంలో వైసీపీలోకి తీసుకుని టీడీపీ షాక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.

    ఇదిలా ఉంటే.. గొట్టిపాటి రవి కుమార్ ప్రకాశం జిల్లాలో ప్రముఖ గ్రానైట్ వ్యాపారస్తుడు. ఇటీవల ఆయన క్వారీలపై పెద్ద ఎత్తున ప్రభుత్వం ఫెనాల్టీలు వేసింది. దీంతో చేసేదిలేక గొట్టిపాటి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఇవ్వడంతో ఇక వ్యాపారాలు చేసుకోవచ్చని ఆయన భావించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం గ్రానైట్ రాయిని తరలించి ఎగుమతి చేసే సమయంలో రవాణా శాఖ అధికారులు అనేక అడ్డంకులు పెడుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. తన వ్యాపార ఇబ్బందులు తట్టుకోలేకే ఆయన టీడీపీ నుండి వైసీపీ కి మారుతున్నట్లు మరో ప్రచారం సాగుతోంది. ఇదే దారిలో మరికొందరు ముఖ్య నేతలు కూడా త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు