టీడీపీ మారను... వాటిపై స్పందించను... గంటా వివరణ

Ganta Srinivasa Rao | తాను పార్టీ మారబోతున్నట్టు ఊహాగానాలపై టీడీపీ ఎమ్మెల్యే,మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు.

news18-telugu
Updated: June 25, 2019, 2:01 PM IST
టీడీపీ మారను... వాటిపై స్పందించను... గంటా వివరణ
గంటా శ్రీనివాసరావు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: June 25, 2019, 2:01 PM IST
తాను పలువురు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తలపై ఏపీ మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. తాను పార్టీ మారుతానంటూ మీడియా మరియు సోషల్ మీడియాలో ప్రసారం చేసుకుంటున్నారన్న గంటా...ఆ వార్తలకు నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్నికల ముందు, తర్వాత మరియు ఇప్పుడు కథనాలు వచ్చాయని వెల్లడించారు. ఎప్పటికప్పుడు అలాంటి అసత్య కథనాలు వస్తూనే ఉంటాయని అన్నారు. తాను తెలుగుదేశం పార్టీ మారే ప్రసక్తే లేదని ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా స్పష్టం చేశారు.అంతకుముందు గంటా శ్రీనివాసరావు మరో 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. వీరంతా కొలంబోలో చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరిగింది. కొలంబో నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి వీరంతా బీజేపీలో చేరతారని వార్తలు బలంగా వినిపించాయి. అయితే తాను దైవదర్శనం కోసమే కొలంబో వెళ్లానని స్పష్టం చేసిన గంటా శ్రీనివాసరావు... పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించారు.

First published: June 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...