మాజీమంత్రి గంటా సరికొత్త వ్యూహం... పక్కా ప్లాన్...

టీడీపీకి చెందిన మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారని విశాఖ రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.

news18-telugu
Updated: August 31, 2019, 4:01 PM IST
మాజీమంత్రి గంటా సరికొత్త వ్యూహం... పక్కా ప్లాన్...
గంటా శ్రీనివాసరావు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తరువాత అందరికంటే ముందు పార్టీ మారతారనే ఊహాగానాలు వినిపించింది మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుపైనే. తనతో పాటు గంటా శ్రీనివాసరావు అనేకమంది టీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకెళ్లబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఇటీవల రాజధాని అంశంపై టీడీపీ తరపున స్పందించిన గంటా శ్రీనివాసరావు... విశాఖను ఏపీకి ఆర్థిక రాజధాని చేయాలంటూ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఆయన తెరపైకి తీసుకొచ్చిన ఈ డిమాండ్‌పై టీడీపీలోనూ చర్చ మొదలైందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే పార్టీ మారే విషయంలో గంటా శ్రీనివాసరావు వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే పలుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన గంటా... తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సినిమా హీరోగా సక్సెస్ కాలేకపోయిన తన కుమారుడు గంటా రవితేజను రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్న గంటా... బీజేపీ లేదా వైసీపీ ద్వారా తనయుడిని రాజకీయాల్లోకి తీసుకురావాని యోచిస్తున్నట్టు జిల్లా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తన కుమారుడి పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చిన తరువాతే పార్టీ మార్పు అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారని వార్తలు జోరందుకున్నాయి. మొత్తానికి మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.


First published: August 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు