బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యే... ఎమ్మెల్సీతో సమావేశం
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీలోకి వెళతారనే ప్రచారం కొద్దిరోజుల నుంచి జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు గంటాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
news18-telugu
Updated: November 13, 2019, 11:33 AM IST

తెలుగుదేశం పార్టీ లోగో
- News18 Telugu
- Last Updated: November 13, 2019, 11:33 AM IST
మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కలిశారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీలోకి వెళతారనే ప్రచారం కొద్దిరోజుల నుంచి జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు గంటాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు... టీడీపీ త్వరలో ఖాళీ అవడం ఖాయమని అన్నారు. టీడీపీ నుంచి త్వరలోనే మరికొంతమంది నేతలు బీజేపీలోకి వస్తారని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే గంటా శ్రీనివాసరావు బీజేపీలోకి వెళ్లడం ఖాయమనే నేపథ్యంలోనే సోము వీర్రాజు ఆయనను కలిశారని తెలుస్తోంది. కొంతకాలంగా ఢిల్లీ స్థాయిలోని బీజేపీ నేతలతో టచ్లో ఉన్న గంటా శ్రీనివాసరావు... పార్టీలో చేరికపై వారితో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆపరేషన్ కమలం... సీఎం జగన్ మరో కొత్త వ్యూహం...
బీజేపీకి షాక్ : పౌరసత్వ సవరణను సుప్రీంలో సవాల్ చేయనున్న మిత్రపక్షం
'ఐయామ్ నాట్ రాహుల్ సావర్కర్.. ఐయామ్ రాహుల్ గాంధీ'
రాహుల్ గాంధీపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
పసుపు రైతులకు బీజేపీ ఎంపీ శుభవార్త..
ఢిల్లీలో కాళ్లు పట్టుకుంటారు.. ఇక్కడేమో.. : టీఆర్ఎస్పై లక్ష్మణ్ విసుర్లు