బీజేపీలోకి గంటా... మాజీ ఎమ్మెల్యే సంకేతాలు ?

గంటా శ్రీనివాసరావు బీజేపీలోకి వెళ్లబోతున్నారనే ఊహాగానాలు మరోసారి జోరందుకున్నాయి. బీజేపీ తరపున ఆయనపై పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి.

news18-telugu
Updated: August 3, 2019, 5:58 PM IST
బీజేపీలోకి గంటా... మాజీ ఎమ్మెల్యే సంకేతాలు ?
గంటా శ్రీనివాసరావు(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: August 3, 2019, 5:58 PM IST
టీడీపీ ముఖ్యనేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే బీజేపీలోకి వెళతారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. తాను పార్టీ మారనని ఆయన కూడా పలుసార్లు స్పష్టం చేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఊహాగానాలు మాత్రం ఎప్పటికప్పుడు రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి గంటా శ్రీనివాసరావు బీజేపీలోకి వెళ్లబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. బీజేపీ తరపున ఆయనపై పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. బీజేపీలోకి ఎవరొచ్చినా తాము ఆహ్వానిస్తామని విష్ణుకుమార్ రాజు అన్నారు.

ఎన్నికలకు ముందు చేసుకున్న విమర్శలు కేవలం రాజకీయపరమైనవి మాత్రమే అని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడానికి అసలు కారణం గంటా శ్రీనివాసరావు బీజేపీలోకి వస్తుండటమే అని విశాఖ జిల్లా రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తనకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్న గంటా శ్రీనివాసరావు... కొద్దిరోజుల నుంచి పార్టీ వ్యవహారాల విషయంలో అంటిముట్టనట్టుగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే వైసీపీ సైతం గంటాను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... గంటాను పార్టీలో చేర్చుకోవడం వల్ల నగరంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. మొత్తానికి టీడీపీలో సైలెంట్‌గా ఉన్న గంటా శ్రీనివాసరావు బీజేపీలో వెళతారా లేక వైసీపీ వైపు చూస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.First published: August 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...