జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ప్రశంసలు కురిపించారు.

news18-telugu
Updated: December 9, 2019, 12:24 PM IST
జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే ప్రశంసలు
సీఎం జగన్
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ప్రశంసలు కురిపించారు. అసెంబ్లీ లాబీల్లో పిచ్చాపాటిగా మాట్లాడిన గణబాబు... సీఎం జగన్‌కి గ్రౌండ్ లెవల్ సమాచారం కరెక్ట్‌గా వస్తోందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో సమాచారం కచ్చితంగా తెప్పించుకుంటున్నారని ఎమ్మెల్యే గణబాబు వ్యాఖ్యానించారు. ఇంటెలిజెన్స్ ద్వారా కాకుండా సొంత మార్గాల్లో సీఎం సమాచారం తెప్పించుకుంటున్నారని అన్నారు. మొన్న విశాఖలో జరిగిన సమీక్షలో ఈ విషయం స్పష్టమైందని తెలిపారు. ఇంటెలిజెన్స్ చెప్పని సమాచారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తెప్పించుకున్నారని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. అలాంటి సమాచారం నాయకుడు అనే వాడికి అవసరమని అన్నారు.






First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>