Jr. NTR: ‘జూనియర్ ఎన్టీఆర్‌’‌పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే..

జూనియర్ ఎన్టీఆర్

Jr. Ntr: జూనియర్ ఎన్టీఆర్ అంశంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.

  • Share this:
    టీడీపీకి మళ్లీ పూర్వవైభవం రావాలంటే.. ఆ పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రీ ఎంట్రీ ఇవ్వాల్సిందే అనే నినాదంలో టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. కొన్నిసార్లు చంద్రబాబు పర్యటనల్లో సైతం జూనియర్ ఎన్టీఆర్ రావాలనే నినాదాలు వినిపించాయి. కొందరైతే స్వయంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే అని నినాదాలు చేశారు. చంద్రబాబు పర్యటనలో కనిపించిన ఈ దృశ్యాలు అప్పట్లో టీడీపీతో పాటు ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించాయి. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ రావాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయా ? లేక చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు కొందరు కావాలనే ఈ రకమైన నినాదాలు చేస్తున్నారా ? అనే అంశంపై టీడీపీ అంతర్గతంగా విచారణకు కూడా ఆదేశించిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ మధ్య టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బచ్చయ్య చౌదరి కూడా జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే బాగుంటందని చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. ఆయన టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

    అయితే తాజాగా గతంలో తాను జూనియర్ ఎన్టీఆర్ అంశంపై చేసిన వ్యాఖ్యలకు బుచ్చయ్య చౌదరి వివరణ ఇచ్చారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను మీడియా తమకు ఇష్టం వచ్చినట్టుగా ఊహించుకుందని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీ కోసం ముందుకొచ్చి పని చేస్తే బాగుంటుందని మాత్రమే తాను అన్నానని చెప్పుకొచ్చారు. దాని అర్థం టీడీపీని ఆయనే నడిపించాలని కాదని వివరించారు.

    జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం పని చేయడానికి వస్తారా ? లేదా ? అనే అంశం ఎన్టీఆర్ కుటుంబం వ్యవహారమని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ఇది వారు కుటుంబంలో కూర్చుని చర్చించుకోవాల్సిన విషయమని అన్నారు. ఇక కొన్ని వారాల క్రితం బుచ్చయ్య చౌదరి టీడీపీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయున్నారనే వార్త పెద్ద సంచలనం సృష్టించింది.

    EPF-Aadhar link: ఈపీఎఫ్‌-ఆధార్ లింక్ గ‌డువు పొడ‌గింపు.. డిసెంబ‌ర్ వ‌ర‌కు అవ‌కాశం

    Money Transfer to Wrong Account: పొరపాటుగా వేరే అకౌంట్‌కు వెళ్లిన డబ్బును తిరిగి పొందవచ్చా ?.. అందుకు ఏం చేయాలి ?

    పార్టీ సరైన మార్గంలో నడవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన టీడీపీ సీనియర్ నేత ఆయనతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి బుచ్చయ్య చౌదరితో మాట్లాడటంతో ఆయన కూల్ అయ్యారు. తాజాగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన బుచ్చయ్య చౌదరి.. జూనియర్ ఎన్టీఆర్ అంశంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. నారా లోకేశ్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్నారని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: