బాలకృష్ణకు షాక్... భార్య సంతకం ఫోర్జరీ

వసుంధర ఖాతాకు సంబంధించి మొబైల్‌ బ్యాంకింగ్‌ దరఖాస్తును యాక్టివేట్‌ చేయాలా? అని అడిగారు. దీంతో తాము ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

news18-telugu
Updated: February 17, 2020, 9:40 AM IST
బాలకృష్ణకు షాక్... భార్య సంతకం ఫోర్జరీ
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)
  • Share this:
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కొందరు షాక్ ఇచ్చారు. ఆయన సతీమణి వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేశారు. అయితే బ్యాంకు అధికారులు కన్‌ఫర్మేషన్ కాల్ రావడంతో అసలు నిజం యటపడింది. దీంత ఫోర్జరీకి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసుల తెలిసిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బంజారాహిల్స్‌ శాఖ రిలేషన్‌షిప్‌ మేనేజర్లు శ్రీనివాస్‌, ఫణీంద్ర ఈ నెల 13న బాలకృష్ణ అకౌంటెంట్‌ వెలిగల సుబ్బారావుకు ఫోన్‌ చేశారు. వసుంధర ఖాతాకు సంబంధించి మొబైల్‌ బ్యాంకింగ్‌ దరఖాస్తును యాక్టివేట్‌ చేయాలా? అని అడిగారు. దీంతో తాము ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అనంతరం వారు వసుంధరను సంప్రదించగా.. ఆమె సైతం ఇదే విషయం చెప్పారు. దీంతో బ్యాంకు అధికారులు విచారణ చేపట్టారు.  బాలకృష్ణ వద్ద కొత్తగా చేరిన జూనియర్‌ అకౌంటెంట్‌ కొర్రి శివ వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆయన మొబైల్‌ బ్యాంకింగ్‌ కోసం దరఖాస్తు కూడా చేసినట్లు తేల్చారు. దీంతో సుబ్బారావు ఫిర్యాదు మేరకు శివపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే జూనియర్ అకౌంటెంట్ శివ కొద్ది రోజుల క్రితమే బాలయ్య దగ్గర పనిలోకి చేరినట్లు తెలుస్తోంది.


For more sample papers of CBSE Class 10, please Click here:

Published by: Sulthana Begum Shaik
First published: February 17, 2020, 9:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading