నేను సైగ చేస్తే.... వైసీపికి బాలయ్య స్ట్రాంగ్ వార్నింగ్

ఆ సమయంలో నా వెనుక వందలాది మంది ఉన్నారు... నా మౌనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దంటూ బాలయ్య వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: January 31, 2020, 12:36 PM IST
నేను సైగ చేస్తే.... వైసీపికి బాలయ్య స్ట్రాంగ్ వార్నింగ్
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీకి ... టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న హిందూపురం పర్యటనలో బాలయ్యను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.దీనిపై సీరియస్ అయినా... బాలయ్య నిన్న నేను ఒక్క సైగ చేస్తే...ఏమయ్యేదంటూ సీరియస్ అయ్యారు. తన వెనుక ఆ సమయంలో వందలాది మంది ఉన్నారన్నారు. నా మౌనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దన్నారు. కక్ష సాధింపు చర్యలతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందన్నారు బాలకృష్ణ. తండ్రి మండలిని పునరుద్ధరిస్తే.. కుమారుడు రద్దు చేస్తున్నాడంటూ జగన్‌పై సెటైర్లు వేశారు బాలయ్య. నిన్న బాలకృష్ణకు సొంత నియోజకవర్గం హిందూపురంలోనే చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. పర్యటనకు వెళ్లిన ఆయనను స్థానికులు, వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకించినందున బాలయ్యను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన వారిలో స్థానికులు, వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. రాయలసీమ ద్రోహి గో బ్యాక్ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. బాలయ్య గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

మరోవైపు బాలకృష్టకు మద్దతుగాకాన్వాయ్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నేతలు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి నిరసనకారుల్ని చెదరగొట్టారు. అక్కడ నుంచి బాలయ్య కాన్వాయ్‌ను పంపించివేశారు. అయితే నిరసన కారులు మాత్రం బాలయ్య కాన్వాయ్ వెళ్లినంత దూరం బాలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో పలువురు ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంతవరకు మూడు రాజధానులకు వ్యతిరేకంగా బాలకృష్ణ ఎక్కడా నోరు విప్పడం లేదు. కానీ చంద్రబాబు చేస్తున్నఆందోళనలకు మాత్రం ఆయన మద్దతు తెలుపుతూ వచ్చారు.కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్‌కు బ్రేక్ వేశారు. తొలిసారిగా మూడురాజధానుల అంశంపై స్పందించడమే కాకుండా వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మరి బాలయ్య వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

First published: January 31, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు