అందరూ బంట్రోతులే... వైసీపీపై బాలయ్య సెటైర్

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ‘చంద్రబాబు రాకుండా ఆయన బంట్రోతును పంపారు.’ అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై సభలో గొడవ జరిగింది.

news18-telugu
Updated: June 14, 2019, 12:33 PM IST
అందరూ బంట్రోతులే... వైసీపీపై బాలయ్య సెటైర్
బాలయ్యకు స్పాట్ ఫిక్స్ చేస్తున్న సీఎం జగన్... హిందూపురం కేంద్రంగా...
news18-telugu
Updated: June 14, 2019, 12:33 PM IST
వైసీపీ నేతలపై సీరియస్ అయ్యారు ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. అసెంబ్లీలో టీడీపీ నేతల్ని వైసీపీ ఎమ్మెల్యేలు బంట్రోతు అని కామెంట్స్ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రజల విషయంలో ఎవరైనా సరే బంట్రోతులే అన్నారు. ప్రజల సేవ విషయంలో మేం బంట్రోతులమే కానీ.. వైసీపీ వాళ్లు అనుకున్నట్లు కాదని చురకలంటించారు. వైసీపీ ఎమ్మోల్యేలు ఎవరికి బంట్రోతులే వారికే తెలుసన్నారు బాలయ్య. టీడీపీ నేతల్ని పట్టుకొని బంట్రోతులుగా అనడం సరికాదన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఎవరైనా సరే బంట్రోతుల్లాగే మారి ప్రజలకు సేవ చేయాలన్నారు. మరోవైపు గవర్నర్ ప్రసంగంపై కూడా స్పందించారు బాలకృష్ణ. గవర్నర్ ప్రసంగంలో అమరావతి ప్రస్తావన ఎక్కడా రాలేదని విమర్శించారు. జలయజ్ఞం పేరుతో చాలా ప్రాజెక్టులు గతంలో ప్రారంభమైనా.. వాటిని పూర్తి చేసింది మాత్రం టీడీపీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు బాలయ్య.

గురువారం ఏపీ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక సందర్భంగా తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నారు. కానీ, స్పీకర్ మీద ఉన్న గౌరవార్థం ప్రతిపక్షం తరఫున అచ్చెన్నాయుడును పంపారు. ఈ అంశంపై మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ‘చంద్రబాబు రాకుండా ఆయన బంట్రోతును పంపారు.’ అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై గొడవ జరిగింది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను బంట్రోతు అనడం ఏంటంటూ అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలిపారు.‘చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. నేను ఎమ్మెల్యేనా?, బంట్రోతునా చెప్పాలి. నేను చంద్రబాబు బంట్రోతు అయితే, మీ 150 మంది జగన్ బంట్రోతులు.’ అంటూ అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో సభలో అధికార విపక్షాల మధ్య గొడవ జరిగింది.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...