జగన్ చేతగానితనానికి ఇదే నిదర్శనం... అచ్చెన్నాయుడు ఫైర్...

పల్లెవెలుగు, సిటీ సర్వీస్‌పై కిలోమీటర్‌కు 10 పైసలు, మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పున పెంచుతున్నట్టు మంత్రి పేర్ని నాని ప్రకటించారు.

news18-telugu
Updated: December 7, 2019, 10:46 PM IST
జగన్ చేతగానితనానికి ఇదే నిదర్శనం... అచ్చెన్నాయుడు ఫైర్...
మంత్రి అచ్చెన్నాయుడు (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ చార్జీల పెంపు మీద టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజల మీద ఎలాంటి భారం వేయబోమని చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన ఆరు నెలల్లోనే చార్జీలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజలపై పైసా భారం వేయనని పాదయాత్రలో జగన్ చెప్పారు.
పన్నులు, ఛార్జీలు పెంచమని చెప్పి ప్రజలను నమ్మించారు. 6నెలల్లోనే ఆర్టీసి ఛార్జీలు పెంచడం ప్రజలను మోసగించడమే. జగన్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మరోసారి రుజువైంది. ఆర్టీసి ఛార్జీల పెంపు నిర్ణయం జగన్ చేతగానితనానికి నిదర్శనం. ఆర్టీసి రూ.1200కోట్ల నష్టాలలో ఉందని చెప్పడం హాస్యాస్పదం. టిడిపి 5ఏళ్ల పాలనలో పేదలపై భారం మోపలేదు. భారాలు వేయకుండానే ఆర్టీసిని బలోపేతానికి చర్యలు చేపట్టాం. బస్సులు కొనడానికి భారీగా నిధులు ఇచ్చాం. ఆర్టీసి కార్మికులకు 42% ఫిట్ మెంట్ ఇచ్చినా ప్రజలపై భారం వేయలేదు..’ అని అచ్చెన్నాయుడు అన్నారు.

ఓ వైపు ఉల్లిధరలు పెరిగి ప్రజలు అల్లాడుతుంటే, మరోవైపు ఆర్టీసీ ఛార్జీలు పెంచి వారి నడ్డి విరగ్గొడుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. సంక్షేమం ముసుగులో ప్రభుత్వ భూములు అమ్ముతున్నారని, రాష్ట్రాన్నే ఏకంగా అమ్మేయాలని చూస్తున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

పల్లెవెలుగు, సిటీ సర్వీస్‌పై కిలోమీటర్‌కు 10 పైసలు, మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పున పెంచుతున్నట్టు మంత్రి పేర్ని నాని ప్రకటించారు. పెరిగిన రేట్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో త్వరలో చెబుతామని మంత్రి పేర్ని నాని చెప్పారు.First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>